
ఫీల్డర్లు ఉన్న చోటుకే బంతులు
ఫీల్డర్లు ఉన్న చోటుకే క్యాచ్‌లు వచ్చాయని సునీల్ గవాస్కర్ అన్నాడు. తద్వారా మైదానంలో ఫీల్డర్లు ఎక్కువగా కదలాల్సిన అవసరం రాలేదని వ్యాఖ్యానించాడు. సరైన ప్లేసులో కెప్టెన్ ఫీల్డర్లను సెట్ చేయడమే దీనికి కారణంగా ఆయన చెప్పుకొచ్చాడు. బౌలింగ్‌లో రవీంద్ర జడేజాకు రోహిత్ శర్మ సరైన సమయంలో బాల్ ఇచ్చాడని గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. దీంతో టీమిండియా మరో రెండు రోజులు మిగిలి ఉండగానే మ్యాచ్ గెలిచిందని అన్నాడు. ఏ టీమైనా సరే 3 రోజుట్లోనే గెలిస్తే ఆ జట్టు ఎంత బలమైనదో తెలుస్తుందని ఆయన చెప్పాడు. అంతేకాకుండా రోహిత్ శర్మ కెప్టెన్సీకి సునీల్ గవాస్కర్ 10కి 9.5 రేటింగ్ కూడా ఇచ్చాడు.

రోహిత్ ఫాలోఆన్ ఆడించాడు
టీమిండియా మాజీ పేసర్ అజిత్ అగార్కర్ కూడా రోహిత్ శర్మ కెప్టెన్సీపై ప్రశంసలు కురిపించాడు. తొలి టెస్టులో రోహిత్ శర్మ కీలక నిర్ణయాలు తీసుకున్నాడని, అవి కూడా సొంత నిర్ణయాలు తీసుకున్నాడని చెప్పుకొచ్చాడు. ఈ మధ్య కాలంలో ఏ జట్లు కూడా ఫాలో ఆన్ ఆడలేదని, కానీ శ్రీలంకను రోహిత్ శర్మ ఫాలో ఆన్ ఆడించాడని అన్నాడు.
కెప్టెన్‌గా తనదైన రీతిలో పని చేస్తూ రోహిత్ శర్మ జట్టును ముందుకు తీసుకెళ్తున్నాడని ఆయన కొనియాడాడు. రోహిత్ శర్మకు జట్టు కూర్పు సరిపోయిందని అన్నాడు. కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ అద్భుతమైన విజయాలు సాధించినప్పటికీ, కొన్ని విషయాల్లో రోహిత్ శర్మ అతని కంటే మెరుగ్గా ఉన్నాడని అజిత్ అగార్కర్ అభిప్రాయపడ్డాడు.

ఇండియా ఘనవిజయం
ఇక మొహాలీ వేదికగా జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో పూర్తి అధిపత్యాన్ని కనబరిచిన టీమిండియా ఇన్నింగ్స్ 222 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో రవీంద్ర జడేజా ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టాడు. బ్యాటింగ్‌లో అజేయంగా 175 పరుగులు చేయడంతోపాటు బౌలింగ్‌లో 9 వికెట్లు తీశాడు. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు తీసిన జడ్డూ, సెకండ్ ఇన్నింగ్స్‌లో 4 వికెట్లు తీశాడు. దీంతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు జడేజాకే దక్కింది. కాగా ఫస్ట్ ఇన్నింగ్స్‌లో టీమిండియా 574-8 వద్ద డిక్లేర్ చేసింది. ఇక శ్రీలంక విషయానికొస్తే ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 174, సెకండ్ ఇన్నింగ్స్‌లో 178 పరుగులు మాత్రమే చేసింది.

రెండో టెస్ట్‌కు భారత జట్టు
రోహిత్ శర్మ (కెప్టెన్), ప్రియాంక్ పంచల్, మయాంక్ అగర్వాల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, హనుమ విహారి, శుభ్‌మన్ గిల్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), కెఎస్ భరత్, రవీంద్ర జడేజా, జయంత్ యాదవ్, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, సౌరభ్ కుమార్, మహ్మద్ సిరాజ్, ఉమేష్ యాదవ్, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్)


Click it and Unblock the Notifications












