తనతో చేతులు కలపాలని పిలుపు: రోహిత్ శర్మ కొత్త సంకల్పం!

హైదరాబాద్: ఖడ్గమృగాలను సంరక్షించేందుకు టీమిండియా వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ ముందుకొచ్చాడు. ఇందులో భాగంగా వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ (డబ్ల్యూడబ్ల్యూఎఫ్) ఇండియా, యానిమల్ ప్లానెట్‌తో కలిసి పనిచేసేందుకు రోహిత్ శర్మ సిద్ధమయ్యాడు.
సెప్టెంబర్ 22 ప్రపంచ ఖడ్గమృగాల దినోత్సవం. ఈ సందర్భంగా యానిమల్ ప్లానెట్ సంస్థ 'రోహిత్4రైనోస్' అనే ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించబోతోంది. ఇందులో భాగంగా అంతరించిపోతున్న ఖడ్గమృగాలను కాపాడటానికి తనతో చేతులు కలపాలని రోహిత్ శర్మ తన ట్విట్టర్ వేదికగా అభిమానులకు పిలుపునిచ్చాడు.
మిగతా ప్రాణులను కాపాడటం మన బాధ్యత
రోహిత్ శర్మ మాట్లాడుతూ "‘మనతో పాటు ఈ భూమ్మీద జీవిస్తున్న మిగతా ప్రాణులను కాపాడటం మన బాధ్యత. వాటి భవిష్యత్తు మన చేతుల్లోనే ఉంది. ప్రకృతి ఇచ్చిన వనరులను మన పిల్లల కోసం కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. డబ్ల్యూడబ్ల్యూఎఫ్ ఇండియా, యానిమల్ ప్లానెట్ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం అందర్నీ చైతన్యవంతం చేస్తుందని ఆశిస్తున్నాను" అని అన్నాడు.

3,500 ఖడ్గమృగాలు
ఈ మేరకు రోహిత్ శర్మ తన ట్విట్టర్‌లో "ప్రస్తుతం ప్రపంచంలో సుమారు 3,500 ఖడ్గమృగాలు ఉన్నాయి. వీటిలో 82% భారత్‌లోనే ఉన్నాయి. ఖడ్గమృగాల కోసం ప్రపంచ ఖడ్గమృగాల దినోత్సవం రోజున నాతో చేతులు కలపండి" అని ట్వీట్ చేశాడు. 2018లోనే డబ్ల్యూడబ్ల్యూఎఫ్ ఇండియా బ్రాండ్ అంబాసిడర్‌గా రోహిత్ శర్మ బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే.

లైంగిక సామర్థ్యాన్ని పెంచుకునేందుకు
కాగా, లైంగిక సామర్థ్యాన్ని పెంచుకునేందుకు కొమ్ముల కోసం ఖడ్గమృగాలను విచక్షణ రహితంగా చంపేస్తున్నారు. దీంతో ఖడ్గమృగాల సంఖ్య తగ్గిపోతుంది. బ్లాక్ మార్కెట్‌లో ప్రస్తుతం రైనోల కొమ్ములకు భారీ డిమాండ్ కూడా ఉంది. దీంతో వేటగాళ్లు ఇష్టారీతిలో ఖడ్గమృగాలను చంపేస్తున్నారు. దీంతో వీటిని సంరక్షించాలని రోహిత్ శర్మ నిర్ణయం తీసుకున్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications