For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

రోహిత్ శర్మ 1500: కోహ్లీ తర్వాత రెండో భారత ఆటగాడిగా రికార్డు

By Nageshwara Rao
Rohit Sharma

హైదరాబాద్: కటక్ వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టీ20లో టీమిండియా తాత్కాలిక కెప్టెన్‌ రోహిత్‌ శర్మ మరో మైలురాయి అందుకున్నాడు. అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌ల్లో 1500 పరుగులు పూర్తి చేసిన రెండో భారత ఆటగాడిగా అరుదైన గుర్తింపు సాధించాడు.

కోహ్లీ తర్వాత ఈ ఘనత సాధించిన రెండో భారత క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్‌కు ముందు 15 పరుగుల దూరంలో ఉన్న రోహిత్‌ శర్మ.... లంక బౌలర్ ధనుంజయ వేసిన మూడో ఓవర్‌ మూడో బంతిని బౌండరీకి తరలించి ఈ ఘనతను సొంతం చేసుకున్నాడు.

అయితే మాథ్యూస్‌ వేసిన ఐదో ఓవర్‌ చివరి బంతికి రోహిత్ శర్మ(17) పరుగుల వద్ద చమీరాకు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. దీంతో ఇప్పటివరకు 69 మ్యాచ్‌లు ఆడిన ఈ డాషింగ్‌ ఓపెనర్‌ 130.04 స్ట్రైక్‌ రేటుతో ఒక సెంచరీ, 12 హాఫ్ సెంచరీలతో 1502 పరుగులు చేశాడు.

విరాట్ కోహ్లీ 55 టీ20లాడి 137.84 స్ట్రయిక్‌ రేటుతో 1956 పరుగులు సాధించాడు. మొత్తంగా ఈ జాబితాలో రోహిత్‌ 14వ స్థానంలో ఉండగా కోహ్లీ రెండోస్థానంలో కొనసాగుతున్నాడు. తాజాగా ఈ జాబితాలో రోహిత్ శర్మ చేరాడు. తొలి స్థానంలో న్యూజిలాండ్‌ బ్యాట్స్‌మన్‌ మెకల్లమ్‌ (2140) ఉన్నాడు.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Wednesday, December 20, 2017, 20:28 [IST]
Other articles published on Dec 20, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+