For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐసీసీ వన్డే జట్టు కెప్టెన్‌గా రోహిత్.. మనోళ్లే ఆరుగురు

గతేడాది వన్డే ఫార్మాట్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన 11 మంది ఆటగాళ్లను జట్టుగా ఐసీసీ ప్రకటించింది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మను ఆ టీమ్‌కు సారథిగా ఎంపిక చేసింది. వన్డే వరల్డ్ కప్‌లో తన కెప్టెన్సీతో రోహిత్ భారత్‌ను ఫైనల్‌కు చేర్చిన విషయం తెలిసిందే. తుదిపోరులో ఆస్ట్రేలియాపై విజయం సాధించినప్పటికీ అతడు సారథి వ్యూహాలకు మెచ్చిన ఐసీసీ హిట్‌మ్యాన్‌నే కెప్టెన్‌గా సెలక్ట్ చేసింది.

రోహిత్‌తో పాటు మరో అయిదుగురు భారత ఆటగాళ్లు ఐసీసీ జట్టులో చోటు దక్కించుకున్నారు. ఓపెనర్లుగా రోహిత్ శర్మతో పాటు శుభ్‌మన్ గిల్ ఎంపికయ్యాడు. 2023లో రోహిత్ 52 సగటుతో 1255 పరుగులు చేశాడు. ఇక యువ ఓపెనర్ గిల్ గత క్యాలెండర్‌లో వన్డేల్లో 1584 పరుగులు సాధించాడు. న్యూజిలాండ్‌పై డబుల్ సెంచరీ బాదాడు.

Rohit Sharma is the captain of the ICC ODI team. six from Team India

అయితే స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లిని నాలుగో స్థానంలో ఐసీసీ ఎంపిక చేసింది. వన్‌డౌన్‌లో ప్రపంచకప్ హీరో ట్రావిస్ హెడ్‌ను సెలక్ట్ చేసింది. కోహ్లి 2023 వన్డేల్లో 1377 పరుగులు చేశాడు. అంతేగాక వన్డే వరల్డ్ కప్‌లో పరుగుల వరద పారించి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌ అవార్డు అందుకున్నాడు. న్యూజిలాండ్ పవర్ హిట్టర్ డారిల్ మిచెల్ అయిదో స్థానంలో, దక్షిణాఫ్రికా విధ్వంసకర బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ ఆరోస్థానంతో పాటు వికెట్ కీపర్‌గా ఐసీసీ ప్రకటించింది.

ఆల్‌రౌండర్‌గా సౌతాఫ్రికా ప్లేయర్ మార్కో జేన్సన్ ఎంపికయ్యాడు. బౌలింగ్ విభాగంలో నలుగురు బౌలర్లలో భారత్ ప్లేయర్లు ముగ్గురు ఉన్నారు. మహమ్మద్ షమి, మహమ్మద్ సిరాజ్, కుల్‌దీప్ యాదవ్ ఐసీసీ జట్టులో ఉన్నారు. వీరితో పాటు ఆస్ట్రేలియా స్పిన్నర్ ఆడమ్ జంపా ఎంపికయ్యాడు.

ఐసీసీ మెన్స్ వన్డే టీమ్ 2023: రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, ట్రావిస్ హెడ్, విరాట్ కోహ్లి, డారిల్ మిచెల్, హెన్రిచ్ క్లాసెన్, మార్కో జేన్సన్, ఆడమ్ జంపా, మహమ్మద్ సిరాజ్, కుల్‌దీప్ యాదవ్, మహమ్మద్ షమి.

Story first published: Tuesday, January 23, 2024, 15:03 [IST]
Other articles published on Jan 23, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+