Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Team India: రోహిత్ శర్మ సేఫ్.. హార్దిక్‌కు కెప్టెన్సీ పగ్గాలు అందించడంపై ఆసక్తి చూపని బీసీసీఐ!

Rohit Sharma is safe as BCCI did not discuss split captaincy

శ్రీలంకతో జరిగే టీ20 సిరీస్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఆడటం లేదు. బంగ్లాదేశ్ పర్యటనలో అతని బొటన వేలికి గాయమైన సంగతి తెలిసిందే. దీని నుంచి అతను ఇంకా పూర్తిగా కోలుకోలేదని, అందుకే శ్రీలంకతో టీ20 సిరీస్‌కు అతన్ని ఎంపిక చేయలేదని సమాచారం. ఈ క్రమంలోనే టీ20 సిరీస్‌లో టీమిండియా పగ్గాలను హార్దిక్ పాండ్యాకు అప్పగిస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది.

రోహిత్, ద్రావిడ్‌పై విమర్శలు

రోహిత్, ద్రావిడ్‌పై విమర్శలు

గతేడాది ఆసియా కప్, టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియా ఆశించిన స్థాయిలో రాణించలేదు. ఈ క్రమంలోనే రోహిత్ శర్మ కెప్టెన్సీపై కూడా చాలా మంది పెదవి విరిచారు. రోహిత్ కెప్టెన్సీ చాలా పేలవంగా ఉందని, తాము ఆశించిన స్థాయిలో లేదని విమర్శలు గుప్పించారు. అలాగే హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ విధానాలు టీ20 ఫార్మాట్‌కు పనికిరావని తేల్చేశారు. ద్రావిడ్ డిఫెన్సివ్ విధానాల వల్లనే టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియా ఓటమి పాలైందని తిట్టిన వాళ్లు కూడా ఉన్నారు.

పాండ్యాపై ఆశలు..

పాండ్యాపై ఆశలు..

ఈ వివాదాల నేపథ్యంలోనే టీమిండియా కెప్టెన్సీని విడగొట్టాలని, కోచింగ్ బాధ్యతలు కూడా మార్చాలని కొందరు సూచనలు చేశారు. టీ20ల్లో హార్దిక్ పాండ్యాను కెప్టెన్ చేయాలని, కోచ్‌గా ఆశిష్ నెహ్రా వంటి వాళ్లకు అవకాశం ఇవ్వాలని సూచించారు. గతేడాది కీలకమైన టోర్నీల్లో టీమిండియా పేలవ ప్రదర్శనపై తాజాగా బీసీసీఐ సమీక్ష నిర్వహించింది. ఈ సమావేశానికి రోహిత్ శర్మ, రాహుల్ ద్రావిడ్, వీవీఎస్ లక్ష్మణ్ తదితరులు హాజరయ్యారు. దీనిలో పలు కీలక అంశాలపై చర్చ జరిగింది.

రోహిత్‌కే బీసీసీఐ ఓటు

రోహిత్‌కే బీసీసీఐ ఓటు

ఈ సమావేశంలోనే స్ప్లిట్ కెప్టెన్సీపై కూడా బీసీసీఐ ఒక నిర్ణయం తీసుకుంటుందని అంతా అనుకున్నారు. టీ20 ఫార్మాట్లో జట్టు పగ్గాలను హార్దిక్‌కు అప్పగించేస్తారని భావించారు. ఈ ఫార్మాట్‌లో కొత్త కోచ్‌ను కూడా నియమిస్తారని వార్తలు వచ్చాయి. అయితే బీసీసీఐ పెద్దలు మాత్రం అసలు ఈ అంశంపై చర్చ జరపలేదు. ప్రస్తుతం ఉన్న జట్టునే కొనసాగించాలని నిర్ణయించారు.

దీనిపై బీసీసీఐ వర్గాలు మాట్లాడుతూ.. వన్డేలు, టెస్టుల్లో రోహిత్ కెప్టెన్సీ అద్భుతంగా ఉందని, రికార్డు ఇంత అద్భుతంగా ఉన్నప్పుడు అతన్ని మార్చాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు. ఈ విషయం తెలిసిన అభిమానులు రోహిత్ సేఫ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Story first published: Monday, January 2, 2023, 10:28 [IST]
Other articles published on Jan 2, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+