For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఫేసులో జోష్ లేదు, ఆటలో ధాటి లేదు.. రోహిత్ శర్మ పనైపోయింది..! పాక్ మాజీ ప్లేయర్ హఫీజ్ కామెంట్లు

Rohit Sharma is not in Good form and Captaincy Makes Him nervous says Mohammad Hafeez

ఆసియా కప్ 2022లో ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్‌ల్లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ పెద్ద ఇన్నింగ్స్‌లు ఆడలేకపోయాడు. తన మార్క్ ఇన్నింగ్స్ చూపించలేక తడబడుతున్నాడు. అతను పాకిస్థాన్‌‌తో జరిగిన మ్యాచ్‌లో 18బంతుల్లో 12పరుగులు చేశాడు. అలాగే హాంకాంగ్‌పై 13 బంతుల్లో 21పరుగులు మాత్రమే చేశాడు. రెండు మ్యాచ్‌ల్లోనూ హిట్టింగ్ చేసి సరిగా షాట్ తగలక క్యాచ్ ఔటయ్యాడు. ఇకపోతే రోహిత్ జట్టుకు కెప్టెన్ మాత్రమే కాదు.. జట్టు నంబర్ వన్ ఓపెనర్ కూడా. ఈ ఏడాది ఐపీఎల్లో కూడా అతను సరిగా ఆడలేదు. అతని టీ20 ఫామ్ ఈ మధ్య అంత ప్రభావవంతగా లేదు. రోహిత్ ఫామ్ మున్ముందు ఇలాగే కొనసాగితే జట్టుపై ఒత్తిడి పెరగడం ఖాయం.

వీడియో క్లిప్ చూపించి మరీ..

వీడియో క్లిప్ చూపించి మరీ..

ఇకపోతే బుధవారం హాంకాంగ్‌పై భారత్ 40పరుగుల తేడాతో విజయం సాధించిన తర్వాత పాకిస్థాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహ్మద్ హఫీజ్ రోహిత్ గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కెప్టెన్సీ సంబంధిత ఒత్తిడితో రోహిత్ సతమతమవుతున్నాడని చెప్పాడు. అలాగే రోహిత్ పనైపోయినట్లు కన్పిస్తుందన్నాడు. పీటీవీ స్పోర్ట్స్‌లో జరిగిన చర్చలో హాంకాంగ్‌పై గెలిచిన తర్వాత రోహిత్ మైదానం నుంచి బయటకు వెళ్తున్నప్పటి వీడియో క్లిప్‌ను ప్లే చేయమని హఫీజ్ మొదట కోరాడు. ఈ వీడియో క్లిప్‌ను చూపిస్తూ హఫీజ్ మాట్లాడాడు.

రోహిత్ భయపడుతున్నట్లు కన్పిస్తుంది

రోహిత్ భయపడుతున్నట్లు కన్పిస్తుంది

'మ్యాచ్ గెలిచిన తర్వాత రోహిత్ శర్మ వ్యక్తీకరణను మీరు చూడండి. ఈ హావభావాలు టీమిండియా గెలిచాక కూడా రోహిత్ ఫేసులో మనం చూస్తున్నాం. నేను ఇక్కడ రోహిత్ శర్మ బాడీ లాంగ్వేజ్ గురించి మాట్లాడుతాను. అతను టాస్‌కి వచ్చినప్పుడు చాలా వీక్‌గా కన్పించాడు. అతను భయపడుతున్నట్లు, కంగారు పడుతున్నట్లు అతని ఫేసు చూస్తే అర్థమవుతుంది. ఒకప్పుడు మ్యాచ్‌లలో అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడుతున్నప్పుడు నేను గమనించిన రోహిత్ శర్మను నేను ఇప్పుడు చూడలేకపోతున్నాను. కెప్టెన్సీ వల్ల రోహిత్‌పై ఒత్తిడి ఎక్కువగా ఉందని.. అతను చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడని అనుకుంటున్నాను.' అని హాఫీజ్ తెలిపాడు.

ఇలా అయితే కెప్టెన్‌గా అతనికి కష్టమే

ఇలా అయితే కెప్టెన్‌గా అతనికి కష్టమే

' రోహిత్ ఫామ్ రాను‌రాను క్షీణిస్తోంది. అతను పేలవమైన ఐపీఎల్ ప్రదర్శనను కలిగి ఉన్నాడు.. ఆ తర్వాత కూడా అతని పరుగుల ప్రవాహం కొనసాగలేదు. దానికి తోడు టీమిండియా కెప్టెన్సీ ఒత్తిడి కూడా అతనిపై చాలా ఉంది. అతనో క్రికెట్ బ్రాండ్. పాజిటివ్‌గా ఆడటం, అలాగే దాన్ని తన బ్యాటింగ్లో ప్రతిబింబించడం లాంటి చాలా విషయాలను గమనిస్తే రోహిత్ ఎందుకో తాను గతంలో ఆడినట్లు కన్పించడం లేదు. అతని స్వంత బాడీ లాంగ్వేజ్ ద్వారా చాలా విషయాలు ప్రస్ఫుటమవుతున్నాయి. నా అభిప్రాయం ఏమిటంటే.. అతను కెప్టెన్‌గా ముందుకు సాగడం కష్టం, అతను చాలా కాలం పాటు లీడ్ చేయలేకపోవచ్చు.

రోహిత్‌పై జాలిపడుతున్నాను

రోహిత్‌పై జాలిపడుతున్నాను

రోహిత్ మ్యాచ్ ఆడుతుంటే ఎంతో ఆనందంగా.. చాలా ఉత్సాహంగా కన్పించేవాడు. నేను అతన్ని, అతని ఎక్సయిటింగ్‌ను గతంలో చూశాను. కానీ ఇప్పుడు అతను తన భావాలను వ్యక్తపరచడం లేదు. బహుశా అతను చాలా విషయాలలో పడిపోతున్నట్లు ఉండొచ్చు. నేను అతనిపై జాలిపడుతున్నాను. అతని విషయంలో అతనే స్వయంగా తన ప్రవర్తనను ఉత్సాహపరుచుకోవాలి లేదా టీం మేనేజ్ మెంట్ అయినా అతని విషయంలో నిర్ణయం తీసుకుంటుందని నేను భావిస్తున్నాను.' అని హఫీజ్ అన్నాడు.

Story first published: Friday, September 2, 2022, 20:54 [IST]
Other articles published on Sep 2, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+