Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

క్రికెట్‌ను ఎంతో మిస్సవుతున్నా.. బంతిని బలంగా బాదడం కోసం ఎదురు చూస్తున్నా: రోహిత్

Rohit Sharma is badly missing hitting the cricket ball amid Covid-19 pandemic


ముంబై:
తాను క్రికెట్‌ను ఎంతో మిస్సవుతున్నానని టీమిండియా స్టార్ ఓపెనర్, హిట్‌మ్యాన్‌ రోహిత్ ‌శర్మ అంటున్నాడు. మైదానంలో బంతిని బలంగా బాదడం కోసం ఎదురు చూస్తున్నా అని పేర్కొన్నాడు. అంతా అనుకున్న‌ట్లు సాగితే.. ఈ స‌మ‌యానికి ఐపీఎల్ 2020వ సీజ‌న్‌లో ముంబై ఇండియ‌న్స్‌కు కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రించాల్సిన రోహిత్.. క‌రోనా వైర‌స్ మ‌హ‌మ్మారి విజృంభ‌ణ నేప‌థ్యంలో ఇంటికే ప‌రిమిత‌మ‌య్యాడు. ప్రస్తుతం రోహిత్ ముంబైలోని తన అపార్ట్‌మెంట్‌లో కుటుంబంతో గడుపుతున్నాడు.
 మీ అంత అదృష్టవంతులం కాదు:

మీ అంత అదృష్టవంతులం కాదు:

తాజాగా ఓ టెలివిజన్‌ షోలో ఫోన్‌ ద్వారా ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్‌ బ్రెట్‌ లీతో కలిసి రోహిత్‌ శర్మ మాట్లాడాడు. 'ఇండోర్‌ క్రికెట్‌ ఆడటానికి తగినంత స్థలం ఉంది. కానీ.. అది ముంబైలో ఉండటం ఎంతో దురదృష్టకరం. ప్రస్తుతం ఇక్కడ అపార్ట్‌మెంట్‌ను వదిలి వచ్చే పరిస్థితి లేదు. మేం మీ అంత అదృష్టవంతులం కాదు. ఎందుకంటే.. మీకు ఆడుకునేందుకు సొంత స్థలం ఉంది. అక్కడ మీరు హాయిగా ఆడుకోవచ్చు. ముంబైలో సొంత ఇల్లు ఉండటమే చాలా ఖరీదైన వ్యవహారం' అని రోహిత్ పేర్కొన్నాడు.

ఎంతో మిస్సవుతున్నా:

ఎంతో మిస్సవుతున్నా:

'ముంబైలో నేను ఒక అపార్ట్‌మెంట్‌లో ఉంటాను. ఇక్కడ ఆనందించాల్సిన విషయం ఏంటంటే.. మా ఫ్లాట్‌కు చిన్న బాల్కనీ ఉంది. అది రన్నింగ్‌, వ్యాయామం చేయడానికి మాత్రమే సరిపోతుంది. క్రికెట్ ఆడడానికి అనువుగా ఉండదు. బాల్కనీలో నేను చేయాల్సిన కసరత్తులు చేస్తున్నా. త్వరలోనే జిమ్‌లు తెరిస్తే వెళ్తా. క్రికెట్‌ ఆడకపోవడాన్ని నేను ఎంతో మిస్సవుతున్నా. ముఖ్యంగా బంతిని బలంగా బాదాలన్న కోరిక ఉంది. మీకు తెలుసు మైదానంలో నేను బంతిని ఎంత బలంగా కొడతానో. ఆ సమయం కోసం నేను ఎదురు చూస్తున్నా' అని హిట్‌మ్యాన్‌ రోహిత్ ‌శర్మ తెలిపాడు.

భావోద్వేగాల మధ్య పుట్టినరోజు:

భావోద్వేగాల మధ్య పుట్టినరోజు:

రోహిత్ శ‌ర్మ గత గురువారం 33వ ప‌డిలో అడుగుపెట్టాడు. లాక్‌డౌన్ కారణంగా రోహిత్‌ ఈ సారి పుట్టిన రోజు వేడుక‌ల‌ను కుటుంబ స‌భ్యుల‌తో క‌లిపి జ‌రుపుకున్నాడు. తన పుట్టిన రోజు విభిన్న భావోద్వేగాల మధ్య సాగిందని శుక్రవారం రోహిత్ ట్వీట్ చేశాడు. బాలీవుడ్ దిగ్గజం రిషి కపూర్ గురువారం మృతి చెందగా.. విలక్షణ నటుడు ఇర్ఫాన్ ఖాన్ అంతకు ముందు రోజే కన్నుమూశారు. వీరి మృతిపై రోహిత్ విచారం వ్యక్తం చేశాడు. అలాగే కరోనా నుంచి బయటపడి మళ్లీ అందరం సాధారణ జీవితాలను గడపాలని ఆకాంక్షించాడు.

ధోనీ ప్రయోగం:

ధోనీ ప్రయోగం:

2007లో టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చిన రోహిత్ శర్మ కెరీర్ ఆరంభంలో చాలా క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొన్నాడు. ఒకానొక దశలో రోహిత్ కెరీర్ ముగిసిపోయిందనే వార్తలు కూడా వచ్చాయి. కానీ.. మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ అతడ్ని ప్రయోగాత్మకంగా ఓపెనర్‌గా పంపి క్రికెట్ ప్రపంచానికి కొత్త 'హిట్‌మ్యాన్'‌ని పరిచయం చేశాడు. అప్పటి నుండి రోహిత్ వెనక్కి తిరిగి చూసుకోలేదు. పరుగుల వరద పారిస్తూ.. టీమిండియాకు ఒంటిచేత్తో విజయాలు అందిస్తున్నాడు.

Story first published: Saturday, May 2, 2020, 16:46 [IST]
Other articles published on May 2, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+