Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

INDvsAUS : రోహిత్ కేవలం బ్యాటింగ్ చేస్తే సరిపోదు.. అందరి కళ్లూ అతనిపైనే!

Rohit Sharma is a key factor for Team India in BGT series

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టీమిండియా సారధి రోహిత్ శర్మ చాలా కీలకం కానున్నాడు. కానీ అతను చాలా కాలంగా టెస్టు మ్యాచ్ ఆడకపోవడం అభిమానులకు ఆందోళన కలిగిస్తోంది. గతేడాది ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు సమయంలో కరోనా సోకడంతో రోహిత్ ఆడలేదు. ఇక బంగ్లాదేశ్ సిరీస్‌లో బొటన వేలి గాయం కారణంగా టెస్టు సిరీస్‌కు దూరమయ్యాడు. దీనికితోడు స్వదేశంలో ఆస్ట్రేలియాతో టెస్టు మ్యాచ్ ఆడటం అతనికి ఇదే తొలిసారి. అయినా సరే ఈ సిరీస్‌లో రోహిత్ ఎలాగైనా రాణించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మరి అతను ఎందుకు అంత కీలకమంటే?
ఇన్నింగ్స్ టోన్ సెట్ చేసే ఛాన్స్

ఇన్నింగ్స్ టోన్ సెట్ చేసే ఛాన్స్

టీమిండియాలో ఎగ్రెసివ్‌గా బ్యాటింగ్ చేయగలిగే వాళ్లలో కెప్టెన్ రోహిత్ ఒకడు. పరుగులు చేయడం మొదలు పెడితే చాలా వేగంగా చేయడం రోహిత్‌కు అలవాటు. దానికితోడు స్వదేశంలో రోహిత్ రికార్డు అద్భుతంగా ఉంది. ఈ క్రమంలో అతను జట్టుకు శుభారంభాలు అందించడం చాలా కీలకం కానుంది. ఎందుకంటే మిగతా ఆటగాళ్లు అంత గొప్ప ఫామ్‌లో లేరు. గిల్ ఇంకా టెస్టుల్లో తన స్థానం పదిలం చేసుకోలేదు. రాహుల్, కోహ్లీ ఫామ్ కోసం తంటాలు పడుతున్నారు. పంత్ ఈ సిరీస్‌లో ఆడటం లేదు. గాయం నుంచి ఇటీవలే కోలుకున్న జడేజా కూడా బ్యాటింగ్‌లో అప్పుడే రాణిస్తాడని నమ్మకం లేదు. దీంతో జట్టుకు శుభారంభం అందించి, ఇన్నింగ్స్ టోన్ సెట్ చేయాల్సిన బాధ్యత రోహిత్‌కు ఉంది.

స్వదేశంలో సూపర్ రికార్డు

స్వదేశంలో సూపర్ రికార్డు

రోహిత్ శర్మ తన కెరీర్‌లో ఆడిన టెస్టులు తక్కువే. కానీ స్వదేశంలో అతని రికార్డు అదిరిపోయేలా ఉంది. భారత గడ్డపై మొత్తం 20 టెస్టులు ఆడిన అతను ఏకంగా 1760 పరుగులు చేశాడు. ఈ మ్యాచుల్లో రోహిత్ సగటు కూడా 73పైగా ఉండటం గమనార్హం. వీటిలో ఏడు సెంచరీలు కూడా ఉన్నాయి. ఈ టెస్టుల్లో ఓపెనర్‌గా వచ్చిన 11 మ్యాచుల్లో అతను 66పైగా సగటుతో 991 పరుగులు చేశాడు. ఓపెనర్‌గా అతని అత్యుత్తమ స్కోరు 212 పరుగులు. ఇదే ఫామ్‌ను ఆసీస్ సిరీసులో కూడా కొనసాగిస్తే.. జట్టుకు రోహిత్ చాలా ఉపయోగపడతాడు. అయితే ఆస్ట్రేలియాను స్వదేశంలో టెస్టు మ్యాచులో ఎదుర్కోవడం అతనికి ఇదే తొలిసారనే విషయం మర్చిపోకూడదు.

కెప్టెన్సీ కూడా కీలకమే..

కెప్టెన్సీ కూడా కీలకమే..

ఈ సిరీసులో రోహిత్ కేవలం బ్యాటర్‌గానే కాదు, కెప్టెన్‌గా కూడా చాలా కీలకం కానున్నాడు. ఆస్ట్రేలియా వంటి ప్రత్యర్థితో మ్యాచ్ చేజారకూడదంటే తను వేసే వ్యూహాలు చాలా స్పష్టంగా ఉండాలి. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడం చాలా ముఖ్యం. ఈ సిరీస్‌ను భారత జట్టు 4-0 లేదా 3-1 తేడాతో నెగ్గితేనే వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు చేరుతుంది. కాబట్టి ఒక్క మ్యాచ్‌లో కూడా రోహిత్ అలసత్వం ప్రదర్శించకూడదు. పకడ్బందీ వ్యూహాలతో కంగారూలను ఉక్కిరిబిక్కిరి చేయాలి. కేవలం స్పిన్ పిచ్‌లతో మ్యాచులు గెలవలేం. జట్టు ఎంపిక నుంచి బౌలర్లను సరిగా ఉపయోగించుకునే వరకు రోహిత్ చాలా కష్టపడాలి. అతను ఏమాత్రం తడబడి చిన్న పొరపాటు చేసినా విమర్శలపాలవడం ఖాయం.

Story first published: Wednesday, February 8, 2023, 11:14 [IST]
Other articles published on Feb 8, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+