గ్రెటా ఆవేదనలో నిజం ఉంది: మద్దతుగా నిలిచిన రోహిత్ శర్మ

హైదరాబాద్: "మా భవిష్యత్తును అంధకారంలో పడేసేందుకు హక్కు ఎవరిచ్చారంటూ" ప్రశ్నించిన 16 ఏళ్ల గ్రెటా థన్‌బర్గ్ వ్యక్తం చేసిన ఆవేదనపై టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ స్పందించాడు. గ్రెటా ఆవేదనలో అర్థం ఉందని.. ప్రతిఒక్కరూ పర్యావరణ పరిరక్షణ కోసం పోరాడాల్సిన అవసరం ఉందని రోహిత్ శర్మ పేర్కొన్నాడు.
"మన పిల్లల భవిష్యత్తు కోసం భూగ్రహాన్ని రక్షించకపోవడం అస్సలు సమర్థనీయం కాదు. గ్రెటా థన్‌బర్గ్, నువ్వు మాకందరికీ ఆదర్శం. భవిష్యత్తు తరాలకు స్వచ్ఛమైన భూగ్రహాన్ని అందించడం మనందరి బాధ్యత. ఇక ఈ విషయంలో ఎలాంటి దాటవేతలు లేవు. ఈ క్షణం నుంచే మార్పు దిశగా సాగుదాం" రోహిత్ శర్మ ట్వీట్ చేశాడు.

స్వీడన్‌కు చెందిన 16 ఏళ్ల గ్రెటా
కాగా, స్వీడన్‌కు చెందిన 16 ఏళ్ల గ్రెటా థన్‌బర్గ్ కొన్నేళ్లుగా పర్యావరణ పరిరక్షణ కోసం పోరాటం చేస్తోంది. గతేడాది ఆ దేశ పార్లమెంట్ ముందు ఒంటరిగా ధర్నాకు దిగి ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. తాజాగా సోమవారం ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశాల్లో గ్రెటా థన్‌బర్గ్ ప్రసంగం ప్రపంచం దృష్టిని ఆకర్షించింది.

వాతావరణంలో పెను మార్పులు
వాతావరణంలో పెను మార్పులు చోటుచేసుకున్నాయంటే దానికి కారణం ప్రభుత్వాలు పాలకులే అని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ తరం, నాయకులను ఎన్నటికీ క్షమించదని నాయకులను వేదికపై నుంచి కడిగి పారేసింది. తమ భవిష్యత్తును అంధకారంలో పడేసేందుకు హక్కు ఎవరిచ్చారంటూ ప్రశ్నించడమే కాదు.. అంతటి ధైర్యం ఎక్కడినుంచి వచ్చిందని మండిపడింది.

స్కూళ్లో ఉండాల్సిన అమ్మాయిని
తను ఈ సమయంలో ఎంతో చక్కగా స్కూళ్లో ఉండాల్సిన దాన్నని తన వయసుకు ఈ సమావేశంకు రాకూడదని చెప్పారు. కానీ పాలకులు చేస్తున్న తప్పులకు పర్యావరణం దెబ్బతిని తమలాంటి యువత భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేస్తున్నారని అందుకే దీనిపై ప్రశ్నించేందుకు తాను వచ్చానని గ్రేటా తన్‌బర్గ్ చెబుతూ భావోద్వేగానికి గురైంది.

నా కలలను చెరిపివేశారు
పాలకులంతా కలిసి తను కన్న కలలను చెరిపివేశారని, పాలకులు చెప్పే వట్టి మాటలను నమ్మి తన బాల్యంను కోల్పోయినట్లు గ్రేటా తన్‌బర్గ్ చెప్పింది. అయినప్పటికీ తాను అదృష్టవంతురాలినేనని చెప్పుకొచ్చింది. ఎందుకంటే పాలకులు పర్యావరణంను దెబ్బతీస్తున్న నేపథ్యంలో చాలామంది సామాన్య ప్రజలు చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. త్వరలో మనిషి కూడా క్రమంగా అంతరించిపోతాడని చెప్పిన గ్రేటా తన్‌బర్గ్... ఇప్పటికీ పాలకులు తమ దేశ ఆర్థిక వ్యవస్థ, డబ్బులు గురించే కథలు కథలుగా మాట్లాడుతారని చెప్పింది. మీకెంత ధైర్యం అంటూ ప్రశ్నించింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications