For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

రోహిత్ శర్మకు గాయం.. మధ్యలోనే ఆపేసిన ప్రాక్టీస్.. ఆందోళనలో బీసీసీఐ!!

India vs Bangladesh 2019 : Rohit Sharma Injury Scare For India,Leaves Practice Session || Oneindia
Rohit Sharma injures left thigh, leaves training midway at Arun Jaitley Stadium

ఢిల్లీ: భారత పర్యటనలో బంగ్లాదేశ్‌ మూడు టీ20లు, రెండు టెస్టులు ఆడనుంది. ఆదివారం ఇరు జట్ల మధ్య అరుణ్‌ జైట్లీ స్టేడియంలో తొలి టీ20 మ్యాచ్‌తో ఈ పర్యటన ప్రారంభం కానుంది. గత కొంత కాలంగా తీరిక లేని క్రికెట్ ఆడుతున్న కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ టీ20ల సిరీస్‌ నుండి విశ్రాంతి తీసుకున్నాడు. దీంతో వైస్ కెప్టెన్ రోహిత్‌ శర్మ తాత్కాలికంగా కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టనున్నాడు. టీ20 సిరీస్ కోసం భారత ఆటగాళ్లు ఒక్కొక్కరుగా ఢిల్లీ చేరుకోగా.. బంగ్లాదేశ్ ఆటగాళ్లు బుధవారం ఢిల్లీ చేరుకున్నారు.

 రోహిత్ శర్మకు గాయం:

రోహిత్ శర్మకు గాయం:

ఆదివారం మ్యాచ్ జరగనుండగా.. ఇరు జట్లు ప్రాక్టీస్ సెషన్‌లలో పాల్గొంటున్నాయి. శుక్రవారం బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ సమక్షంలో భారత ఆటగాళ్లు ప్రాక్టీస్ చేశారు. సెషన్‌ ప్రారంభమయిన కొద్ది నిమిషాలకే భారత నెట్ బౌలర్ నువాన్ సెనెవిరత్నే వేసిన బంతి రోహిత్ శర్మ కాలికి బలంగా తాకింది. నొప్పితో విలవిలలాడిన రోహిత్.. చేతి గ్లోవ్స్ తీసి ప్రాక్టీస్ నుండి బయటకి వెళ్ళిపోయాడు. విక్రమ్ రాథోడ్, సెనెవిరత్నే ఆపడానికి ప్రయత్నం చేసినా రోహిత్ మైదానంలో ఉండలేదు.

మ్యాచ్ ఆడక తప్పదు:

మ్యాచ్ ఆడక తప్పదు:

టీం ప్రాక్టీస్ సెషన్‌కు ముందు విక్రమ్ రాథోడ్ మీడియాతో మాట్లాడారు. 'నా క్రికెట్ కెరీర్ మొత్తం ఉత్తర భారతదేశంలోనే సాగింది. ఇక్కడి పరిస్థితులు నాకు తెలుసు. అవును ఇప్పుడు కూడా కాలుష్యం ఎక్కువగా ఉంది. మ్యాచ్ షెడ్యూల్ చేయబడింది కాబట్టి మేము ఆడితీరాల్సిందే. ఆటగాడు ఒక్కసారి మైదానంలోకి దిగాక ఇలాంటి విషయాలను పెద్దగా పట్టించుకోరు. అయితే ఆరోగ్య సలహాలు కూడా తీసుకోవాలి. మేము ఇప్పుడే వచ్చాం. ఇది మొదటి రోజు సాధన మాత్రమే. ఇంకా మేము కాంబినేషన్‌ల గురించి ఆలోచించలేదు' అని విక్రమ్ రాథోడ్ పేర్కొన్నారు.

షెడ్యూల్ ప్రకారమే తొలి టీ20:

షెడ్యూల్ ప్రకారమే తొలి టీ20:

ప్రస్తుతం ఢిల్లీలో తీవ్ర వాయు కాలుష్యం ఉంది. ఢిల్లీ నగరాన్ని కాలుష్యం హడలెత్తిస్తున్నా.. షెడ్యూలు ప్రకారం తొలి టీ20 జరుగుతుందని భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ స్పష్టం చేశారు. కాలుష్యం పంజా విసురుతున్నా భారత్, బంగ్లాదేశ్‌ ఆటగాళ్లు ప్రాక్టీస్ చేస్తున్నారు. ఢిల్లీలో గురువారం ప్రాక్టీస్ చేసిన బంగ్లాదేశ్‌ క్రికెటర్లు పొల్యూషన్‌ మాస్క్‌లు ధరించి ప్రాక్టీస్‌ చేశారు.

యు కాలుష్యం తొలిసారి కాదు:

యు కాలుష్యం తొలిసారి కాదు:

ఢిల్లీలో క్రికెటర్లు వాయు కాలుష్యం బారిన పడటం ఇదే తొలిసారి కాదు. గతంలో భారత పర్యటనకు వచ్చిన శ్రీలంక క్రికెటర్లు సైతం ఇబ్బందులు పడ్డారు. 2017లో కాలుష్యం తట్టుకోలేని కొంతమంది లంక క్రికెటర్లు వాంతులు చేసుకోగా.. మరికొంత మంది అస్వస్థతకు గురయ్యారు. అది టెస్టు మ్యాచ్‌ కావడంతో లంక క్రికెటర్లు ఐదు రోజులు బాధను భరించారు. ఇప్పటివరకూ కూడా ఢిల్లీలో ఏమీ మార్పులు రాలేదు.

Story first published: Friday, November 1, 2019, 17:18 [IST]
Other articles published on Nov 1, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+