Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

రోహిత్ శర్మ అరుదైన రికార్డు: మూడు ఫార్మాట్లలోనూ టాప్-10లో!

India vs Bangladesh 2019 : Rohit Sharma Becomes Third Indian To Reach Top 10 In All 3 Formats
 Rohit Sharma In ICC Rankings: Only Crickter to be in Top 10 in all 3 Formats

హైదరాబాద్: టీమిండియా తాత్కాలిక కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన ఘనత సాధించాడు. నాగ్‌పూర్ వేదికగా ఆదివారం బంగ్లాదేశ్‌తో జరిగిన మూడో టీ20లో టీమిండియా 30 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ విజయంతో మూడు టీ20ల సిరిస్‌ను టీమిండియా 2-1తో కైవసం చేసుకుంది.

ఐసీసీ తాజాగా సోమవారం విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో రోహిత్ శర్మ ఏడో స్థానంలో నిలిచాడు. రాజ్‌కోట్ వేదికగా జరిగిన రెండో టీ20లో తృటిలో సెంచరీని మిస్సైన రోహిత్ శర్మ ఈ సిరిస్‌లో మొత్తం 96 పరుగులు చేశాడు. ఫలితంగా టీ20ల్లో తన ర్యాంకుని మరింతగా మెరుగుపరుచుకున్నాడు.

దీంతో ఐసీసీ ర్యాంకింగ్స్‌లో మూడు ఫార్మాట్లలో టాప్-10లో చోటు దక్కించుకున్న ఏకైక భారత బ్యాట్స్‌మన్‌గా అరుదైన ఘనత సాధించాడు. ప్రస్తుతం రోహిత్ శర్మ టెస్టుల్లో 10వ ర్యాంకులో, వన్డేల్లో రెండో ర్యాంకులో, టీ20ల్లో 7వ ర్యాంకులో కొనసాగుతున్నాడు.

కాగా, నాగ్‌పూర్ వేదికగా ముగిసిన మూడో టీ20లో రోహిత్ శర్మ అరుదైన రికార్డుని తృటిలో మిస్సయ్యాడు. మూడో టీ20లో రోహిత్ శర్మ(2) పరుగులకే పెవిలియన్‌కు చేరడంతో భారత్‌ తరఫున నాలుగొందల సిక్సర్లు రికార్డుని మిస్సయ్యాడు. మూడో టీ20లో రెండు సిక్సులు బాదినట్లైతే ఈ మైలురాయిని అందుకునేవాడు.

భారత్ తరుపున 400 సిక్సర్లు బాదిన మొదటి క్రికెటర్‌గా మొత్తంగా ఈ జాబితాలో చోటు దక్కించుకున్న మూడో క్రికెటర్‌గా నిలిచేవాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఇప్పటి వరకూ అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాళ్ల జాబితాలో విండిస్ విధ్వంసక ఓపెనర్ క్రిస్‌గేల్ 534 సిక్సర్లతో అగ్రస్థానంలో ఉండగా.. పాకిస్థాన్ మాజీ ఆల్‌రౌండర్ షాహిద్ అఫ్రిది 476 సిక్సర్లతో రెండో స్థానంలో ఉన్నాడు.

Story first published: Monday, November 11, 2019, 15:50 [IST]
Other articles published on Nov 11, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+