Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs ENG: రోహిత్ శర్మ ఓపెనింగ్ చేశాకే.. టీమిండియా దశ తిరిగింది! విదేశీ గడపై భారత్ హవా నడుస్తోంది!!

Rohit Sharma Improves Avg Opening Partnership For India In Overseas Tests
Ind vs Eng 2021,2nd Test : Rohit Sharma,KL Rahul అరుదైన రికార్డు..! || Oneindia Telugu

హైదరాబాద్: టీమిండియా అంటేనే బ్యాటింగ్‌కు పెట్టింది పేరు. ఫార్మాట్ ఏదైనా స్వదేశంలో మ్యాచ్ అంటే.. పరుగుల వరద పారాల్సిందే. ఉపఖండ పిచ్‌లు అయినా.. మనోళ్లు చెలరేగుతారు. అక్కడ కూడా దాదాపు విజయం టీమిండియాదే. అయితే విదేశీ గడ్డపై భారత్ రాణించదనే ఓ అపవాదు ఉంది. ముఖ్యంగా టెస్ట్ ఫార్మాట్‌లో. సునీల్ గవాస్కర్, కపిల్ దేవ్, సచిన్ టెండ్యూలర్, సౌరవ్ గంగూలీ, రాహల్ ద్రవిడ్, వీవీఎస్ లక్షణ్ ఉన్నా కూడా విదేశీ గడ్డపై టెస్ట్ సిరీస్ గెలిచిన సందర్భాలు తక్కువే అని చెప్పొచ్చు. అయితే గత 4-5 ఏళ్ల కాలంలో ఈ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. విదేశీ గడ్డపై భారత్ సత్తాచాటుతోంది.

26 ఓవర్లకు కూడా వికెట్ కోల్పోలేదు:

26 ఓవర్లకు కూడా వికెట్ కోల్పోలేదు:

విదేశీ గడ్డపై భారత్ సత్తాచాటుతుండడానికి కారణం జట్టు బలంగా మారడమే. బ్యాటింగ్, బౌలింగ్‌ విభాగంలో మంచి ప్లేయర్స్ ఉన్నారు. అంతేకాకుండా.. ఓపెనింగ్ భాగస్వామ్యం కూడా జట్టు ఫలితాలపై ప్రభావ చూపింది. ముఖ్యంగా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ ఓపెనింగ్ చేశాక టీమిండియా దశ తిరిగింది. రోహిత్ వికెట్ కాపాడుకుంటూ మంచి స్టార్ట్ ఇస్తున్నాడు. దీంతో గతంలో కాకుండా భారత్ ఆదిలోనే వికెట్ కోల్పోవట్లేదు. 2018లో 7.2 ఓవర్లకు భారత్ తొలి వికెట్ కోల్పోతే.. 2019లో 6.1 ఓవర్లకు కోల్పోయింది. 2021లో అయితే 26 ఓవర్లకు కూడా భారత్ వికెట్ కోల్పోలేదు. ప్రస్తతం లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్ జట్టులో జరుగుతున్న రెండో టెస్టులో భారత్ వికెట్ కోల్పోకుండా 26 ఓవర్లలో 77 రన్స్ చేసింది. రోహిత్ హాఫ్ సెంచరీ బాదాడు.

అరుదైన రికార్డు:

అరుదైన రికార్డు:

క్రికెట్ పుట్టినిళ్లు లార్డ్స్ మైదానంలో భారత ఓపెన‌ర్లు కేఎల్ రాహుల్, రోహిత్ శ‌ర్మలు ఓ అరుదైన రికార్డు నెలకొల్పారు. తొలి వికెట్‌కు అత్యధిక భాగస్వామ్యం అందించిన రెండో జోడిగా నిలిచారు. 2008లో ఇంగ్లండ్ ఓపెనర్లు అలిస్టర్ కుక్, ఆండ్రూ స్ట్రాస్.. దక్షిణాఫ్రికాపై నెలకొల్పిన 114 పరుగులే అత్యధికం. 13 సంవత్సరాలుగా మరే జోడి కూడా 50 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పలేకపోయింది. ప్రస్తుతం రాహుల్, రోహిత్ జోడి సెంచరీకి చేరువైంది. కుక్, స్ట్రాస్ జోడి రికార్డును బద్దలుకొట్టే అవకాశం భారత జోడికి ఉంది. మరోవైపు లార్డ్స్ మైదానంలో 1952 తర్వాత అత్యధిక భాగస్వామ్యం నెలకొల్పిన జోడిగా కూడా రాహుల్, రోహిత్ మరో రికార్డు నెలకొల్పారు.

రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ:

రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ:

లార్డ్స్ టెస్టులో భారత జట్టు నిలకడగా ఆడుతోంది. తొలుత నిదానంగా ఆడిన ఓపెనర్ రోహిత్ శర్మ ఆ తర్వాత జోరు పెంచి 8 ఫోర్లు బాది అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మొత్తం 83 బంతులు ఎదుర్కొన్న రోహిత్ 8 ఫోర్ల సాయంతో అర్ధ శతకం నమోదు చేశాడు. ఆ తర్వాత మరో భారీ సిక్సర్ కొట్టాడు. మరోవైపు కేఎల్ రాహుల్ నిదానంగా ఆడుతూ రోహిత్‌కు సహకరిస్తున్నాడు. ప్రస్తుతం 26 ఓవర్లు ముగిశాయి. టీమిండియా వికెట్ నష్టపోకుండా 77 పరుగులు చేసింది. రోహిత్ 56. రాహుల్ 15 పరుగులతో క్రీజులో ఉన్నారు. వర్షం కారణంగా పిచ్ పేస్ బౌల‌ర్ల‌కు అనుకూలిస్తున్నా.. భారత ఓపెనర్లు అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నారు.

Story first published: Thursday, August 12, 2021, 19:27 [IST]
Other articles published on Aug 12, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+