ఐపీఎల్ 2019: ఓపెనర్‌గా రోహిత్ శర్మ, వరల్డ్‌కప్ కోసమేనా?


హైదరాబాద్: టీమిండియాకు సుదీర్ఘకాలంగా ఓపెనర్‌గా ఆడుతున్న రోహిత్ శర్మ ఇండియన్ ప్రీమియిర్ లీగ్ (ఐపీఎల్)లో మాత్రం మిడిలార్డర్‌లో ఆడుతున్నాడు. గత సీజన్‌లో ముంబై తరుపున ఎవిన్ లావిస్, సూర్యకుమార్ యాదవ్ ఓపెనర్లుగా ఇన్నింగ్స్‌ను ఆరంభించగా... రోహిత్ శర్మ మూడు లేదా నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగాడు. ఐపీఎల్ 2019 సీజన్‌లో తాను మళ్లీ ఓపెనర్‌గా ఆడబోతున్నట్లు మంగళవారం ఆ జట్టు మెంటార్ జహీర్ ఖాన్‌తో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో రోహిత్ శర్మ వెల్లడించిన సంగతి తెలిసిందే.

రోహిత్ శర్మ మాట్లాడుతూ
ఈ సందర్భంగా రోహిత్ శర్మ మాట్లాడుతూ "ఐపీఎల్ 2019 సీజన్‌లో నేను ఆడే అన్ని మ్యాచ్‌ల్లోనూ ఓపెనర్‌గా ఆడాలని నిర్ణయించుకున్నాను. ఈ టోర్నీ తర్వాత ప్రపంచకప్ జరగనుండటం కూడా దీనికి ఓ కారణం. అంతేకాకుండా.. నేను ఓపెనర్‌గా అత్యుత్తమ ప్రదర్శన చేయగలుగుతున్నా" అని అన్నాడు.

ఇప్పటికే జట్టుతో చర్చించా
"ఈ విషయాన్ని ఇప్పటికే జట్టుతో చర్చించాను. వారు అర్థం చేసుకున్నారు. జట్టు మిడిలార్డర్‌లో అనుభమున్న ఆటగాళ్లు ప్రస్తుతం ఉన్నారు. కాబట్టి.. ఫ్రాంఛైజీ కూడా ఇందుకు అంగీకారం తెలిపింది" అని రోహిత్ అన్నాడు. అంతేకాదు మే30 నుంచి ఇంగ్లాండ్ వేదికగా జరగనున్న వన్డే వరల్డ్‌కప్ నాటికి ఫామ్ అందుకోవాలని కూడా రోహిత్ శర్మ ఆశిస్తున్నాడు.

గత సీజన్‌లో లీగ్ దశలోనే నిష్క్రమించిన ముంబై
దీంతో తనకి ఎంతగానో అచ్చొచ్చిన ఓపెనింగ్ స్థానంలోనే బరిలోకి దిగాలని నిర్ణయించుకున్నాడు. నిజానికి గత సీజన్‌లో రోహిత్ శర్మ మిడిలార్డర్‌లో ఆడటం వల్లే ఆ జట్టు లీగ్ స్టేజిలోనే టోర్నీ నుంచి నిష్క్రమించింది. 2018 ఐపీఎల్ సీజన్‌లో మొత్తం 14 మ్యాచ్‌లాడిన రోహిత్ కేవలం 286 పరుగులే చేసి నిరాశపరిచాడు.

24న ఢిల్లీ క్యాపిటల్స్‌తో వాంఖడేలో తొలి మ్యాచ్
మార్చి 23 నుంచి ఐపీఎల్ మ్యాచ్‌లు ప్రారంభంకానుండగా.. 24న ఢిల్లీ క్యాపిటల్స్‌తో వాంఖడే వేదికగా ముంబై వేదికగా తన తొలి మ్యాచ్‌లో తలపడనుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications