Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ద్రవిడ్ నాకు ‘వర్క్ వైఫ్’- రోహిత్ శర్మ ఎమోషనల్ పోస్ట్

టీమిండియా కోచ్ పదవికి గుడ్‌బై చెప్పిన రాహుల్ ద్రవిడ్ గురించి కెప్టెన్ రోహిత్ శర్మ సుదీర్ఘమైన ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. అమెరికా-వెస్టిండీస్ వేదికగా జరిగిన టీ20 వరల్డ్ కప్‌లో రోహిత్ సేన విశ్వవిజేతగా నిలిచిన విషయం తెలిసిందే. భారత జట్టు ఛాంపియన్‌గా నిలవడంలో కెప్టెన్‌గా రోహిత్, కోచ్‌గా ద్రవిడ్ కీలక పాత్ర పోషించారు.

అయితే ఈ మెగాటోర్నీ ముగిసిన తర్వాత కోచ్ పదవికి ద్రవిడ్, టీ20 ఫార్మాట్ రోహిత్ వీడ్కోలు పలికారు. 2021 టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియా ఘోర వైఫల్యం అనంతరం కోచ్ బాధ్యతలను ద్రవిడ్ అందుకున్నాడు. అదే సమయంలో రోహిత్ శర్మ కూడా కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్నాడు.వీరిద్దరి కాంబినేషన్‌లో టీమిండియా ఎన్నో ఘనతలు సాధించింది.

Rohit Sharma Honors Work Wife Rahul Dravid You Left Your Achievements at the Door and Became Our Coach

భారత జట్టును 2022 టీ20 వరల్డ్ కప్‌లో సెమీస్‌కు, 2023 వరల్ట్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు, 2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్‌కు, అలాగే 2024 టీ20 వరల్డ్ కప్‌లో విజేతగా నిలవడంలో ద్రవిడ్‌, రోహిత్‌ది ప్రధాన పాత్ర. ఈ నేపథ్యంలో రాహుల్ ద్రవిడ్‌తో ఉన్న అనుబంధాన్ని రోహిత్ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పంచుకున్నాడు. ద్రవిడ్‌ను తన వర్క్ వైఫ్ అని తన భార్య రితికా సజ్‌దేహ్ పేర్కొనడం కరెక్టే అని రోహిత్ అన్నాడు. ద్రవిడ్ తన పని భాగస్వామి ఇలా పరోక్షంగా పేర్కొన్నాడు.

''ప్రియమైన రాహుల్ ద్రవిడ్... సరైన పదాలతో నా భావాలను వ్యక్తపరచడానికి ప్రయత్నిస్తున్నాను. అయితే అది సరిగ్గా చేస్తానో లేదో తెలియదు. ఇది ఓ ప్రయత్రమే. మిమ్మల్ని ఆరాధించే లక్షల మందిలా నేను కూడా చిన్నతనం నుంచే అభిమానించేవాడిని. మీతో ఇంత దగ్గరగా కలిసి పనిచేయడం అదృష్టమే. మీరు ఈ ఆటలో సమర్థులు. కానీ మీకు దక్కిన విజయాలు, ప్రశంసలు గడప అవతలే పెట్టి కోచ్‌గా మా దగ్గరకు వచ్చారు. మీతో ఏమైనా పంచుకునేంతలా దగ్గరయ్యారు''

''ఇంత కాలం తర్వాత కూడా ఆట పట్ల మీకు ఉన్న వినయం, ప్రేమ నిజంగా బహుమతే. మీ నుంచి ఎంతో నేర్చుకున్నాను. ప్రతి జ్ఞాపకం ఎంతో విలువైనది. మా భార్య మిమ్మల్ని నా వర్క్ వైఫ్ అంటుంది. అలా అనడం కూడా అదృష్టమే. మీ ఆయుధగారంలో ప్రపంచకప్ ఒక్కటే మిస్ అయ్యింది. దాన్నిమనం కలిసి సాధించడం ఎంతో సంతోషంగా ఉంది. రాహుల్ భాయ్ మిమ్మల్ని నా నమ్మకస్థుడు, నా కోచ్, నా ఫ్రెండ్‌గా పిలవడం గొప్ప అదృష్టం'' అని రోహిత్ శర్మ పేర్కొన్నాడు.

Story first published: Tuesday, July 9, 2024, 18:54 [IST]
Other articles published on Jul 9, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+