టీ20 ప్రపంచకప్ గెలవాలని రోహిత్ శర్మ ప్రత్యేక పూజలు.. ఆసీస్‌కు సూటూబూటుతో భారత ప్లేయర్లు

ఆస్ట్రేలియాలో జరగనున్న టీ20ప్రపంచకప్ కోసం రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత జట్టు గురువారం తెల్లవారుజామున ఆస్ట్రేలియాకు బయలుదేరింది. 2007లో తొలిసారిగా టీ20 వరల్డ్ కప్ నిర్వహించగా.. అప్పుడు భారత్ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. ఇక 15ఏళ్ల నిరీక్షణకు తెరదించే వేళయింది. మరోసారి ట్రోఫీ ముద్దాడాలని భారత్ ఉవ్విళ్లూరుతుంది. ప్రపంచకప్‌లో భాగంగా అక్టోబర్ 23న పాకిస్థాన్‌తో మ్యాచ్ ద్వారా వరల్డ్ కప్ టోర్నీని భారత్ ప్రారంభించనుంది. సూపర్ 12దశకు ముందు భారత జట్టు రెండు వార్మప్ మ్యాచ్‌లు కూడా ఆడనుంది. అక్టోబర్ 17న ఆస్ట్రేలియాతో, అక్టోబర్ 19న న్యూజిలాండ్‌తో వార్మప్ మ్యాచ్‌లు ఆడి వరల్డ్ కప్ బరిలోకి జట్టు దిగనుంది.
ప్రపంచకప్ గెలవాలనే ఆకాంక్షతో
ఇకపోతే భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ బుధవారం దసరా సందర్భంగా ముంబైలోని సిద్ధివినాయక గుడిలో ప్రత్యేక పూజలు చేశాడు. టీ20 ప్రపంచకప్ గెలవాలనే ఆకాంక్షతో దేవుణ్ని ప్రార్థించినట్లు చెప్పుకొచ్చాడు. తన వెంట సతీమణి రితికాతో పాటు కూతురు సమైర కూడా ఉంది. రోహిత్ బిగ్ టోర్నీల ముందు సిద్ధి వినాయక గుడిలో దర్శనం చేసుకుంటాడనే సంగతి తెలిసిందే.
14మందితో ఆసీస్‌కు బయలుదేరిన జట్టు
ఇకపోతే భారత జట్టు గురువారం తెల్లవారుజామున ఆస్ట్రేలియాకు బయలుదేరింది. టీ20 ప్రపంచకప్‌కు వెళ్లే ఆటగాళ్లందరూ షూటూ బూటుతో మెరిసిపోయారు. ప్లేయర్లు ఓ పక్కా, సపోర్టింగ్ స్టాఫ్ మరో పక్క నిల్చుని ఫోటోలకు పోజులిచ్చారు. ఈ గ్రూప్ ఫోటోను బీసీసీఐ ట్విట్టరులో పోస్ట్ చేసింది. భారత పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రా టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్‌కు.. దూరం కావడంతో ప్రపంచకప్‌కు ముందు భారత్‌కు పెద్ద దెబ్బ తగిలింది. ఆసియాకప్‌కు దూరమైన బుమ్రా ఆసీస్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో తిరిగి జట్టులోకి వచ్చాడు. అయితే గాయం తిరగబెట్టడంతో తొలుత ణాఫ్రికా సిరీస్ నుంచి వైదొలగిన బుమ్రా తర్వాత ప్రపంచకప్‌కు కూడా మిస్సయ్యాడు. ఇక బుమ్రా స్థానంలో ఇంకా ఎవరినీ సెలెక్షన్ కమిటీ ప్రకటించలేదు. అందువల్ల 14మందే ఆసీస్ ఫ్లైట్ ఎక్కారు. రిజర్వ్ ఆటగాళ్లు దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ ముగిశాక ఆసీస్ వెళ్తారు.

ఆసీస్ వెళ్లాక అక్కడి పరిస్థితి చూసి ఎవరో డిసైడ్ అవుతాం
దక్షిణాఫ్రికా టీ20 సిరీస్ తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ.. ఆస్ట్రేలియాలో బుమ్రా స్థానంలో ఎవరిని ఎంపిక చేయాలనే దానిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని చెప్పాడు. ముందు మనకు ఎలాంటి కాంబినేషన్ కావాలో చూసుకోవాలి. బుమ్రాను మేం ఎలా ప్రయోగించాలనుకున్నామో దాని మీద మాకో స్పష్టత ఉంది. అలా మా ప్లాన్స్ అమలు చేసేందుకు సరిపడా బౌలర్‌ను కనుగొనాలి. ఆస్ట్రేలియాలో బౌలింగ్ చేసిన అనుభవం కాస్త ఉండాలి. అయితే ఆస్ట్రేలియాకు వెళ్లాక ఒకసారి అక్కడ బౌలింగ్, పిచ్‌లు ఎలా ఉన్నాయి.. ఎవరైతే సెట్ అవుతారు అదంతా చూశాక ఓ నిర్ణయానికొస్తాం.' అని రోహిత్ శర్మ అన్నాడు. మహ్మద్ షమీ లేదా దీపక్ చాహర్‌లు బరిలోకి దిగుతారని నివేదికలు సూచిస్తున్నాయి. వీరిద్దరు రిజర్వ్ ప్లేయర్లుగా ఉన్న సంగతి తెలిసిందే.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications