
బంగ్లాపై 126 బంతుల్లో 137(14 పోర్లు, 3 సిక్సులు)
ఈ వరల్డ్‌కప్‌లో రోహిత్ శర్మతో పాటు మరో ఓపెనర్ శిఖర్ ధావన్ రెండు సెంచరీలు సాధంచగా.. విరాట్ కోహ్లీ, సురేశ్ రైనా తలో సెంచరీ సాధించారు. ఈ వరల్డ్‌కప్‌లో రోహిత్ శర్మ లీగ్ స్టేజి వరకు కూడా మూడెంకల స్కోరుని అందుకోక పోవడం విశేషం. అయితే, మెల్‌బోర్న్ వేదికగా జరిగిన క్వార్టర్స్‌లో మాత్రం ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత జట్టులో రోహిత్ శర్మ 126 బంతుల్లో 137 పరుగులతో చెలరేగడంతో నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 302 పరుగులు చేసింది. లక్ష్య చేధనలో బంగ్లాదేశ్ 193 పరుగులకే కుప్పకూలడంతో భారత్ 109 పరుగుల తేడాతో విజయం సాధించింది.

దక్షిణాఫ్రికాపై 144 బంతుల్లో 122 నాటౌట్(13 ఫోర్లు, 2 సిక్సులు)
సౌతాంప్టన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన ఈ మ్యాచ్‌లో టీమిండియా 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దక్షిణాఫ్రికా నిర్దేశించిన 228 పరుగుల విజయ లక్ష్యాన్ని టీమిండియా నిర్ణీత 47.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 230 పరుగులు చేసింది. టీమిండియాలో రోహిత్ శర్మ 144 బంతుల్లో 122(13 ఫోర్లు, 2 సిక్సులు) జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. వన్డేల్లో రోహిత్‌కిది 23వ సెంచరీ. ఈ సందర్భంగా టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ పేరిట ఉన్న 22 సెంచరీల రికార్డును రోహిత్ శర్మ బద్దలు కొట్టాడు. ఈ మ్యాచ్‌లో సెంచరీ నమోదు చేసిన ఓపెనర్ రోహిత్ శర్మకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.

పాకిస్థాన్‌పై 113 బంతుల్లో 140(14 ఫోర్లు, 3 సిక్సులు)
మాంచెస్టర్ వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన ప్రపంచకప్ మ్యాచ్‌లో భారత్ డక్ వర్త్ లూయిస్ పద్ధతిలో 89 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 336 పరుగులు చేసింది. అనంతరం 337 పరుగుల లక్ష్య చేధనలో పలుమార్లు వరుణుడు అంతరాయం కలిగించడంతో పాకిస్థాన్ ఇన్నింగ్స్‌ను 40 ఓవర్లకు కుదించారు. దీంతో డక్ వర్త్ లూయీస్ పద్ధతి ప్రకారం పాకిస్థాన్‌కు 40 ఓవర్లలో 302 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు. అయితే, పాకిస్థాన్ నిర్ణీత 40 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 212 పరుగులు మాత్రమే చేసింది. ఈ విజయంతో భారత్ వరుసగా ఏడో సారి ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌పై భారత్ తిరుగులేని విజయాన్ని నమోదు చేసింది. ఈ మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగి టీమిండియా విజయంలో కీలకపాత్ర పోషించిన రోహిత్‌కు 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డు లభించింది.

జులై 2న బంగ్లాదేశ్‌తో మ్యాచ్
ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచకప్‌లో గ్రీన్ కలర్ జెర్సీ ధరించి ఆడే జట్టుతో ఒక మ్యాచ్ మిగిలింది. ఆ జట్టు మరేదో కాదు బంగ్లాదేశ్. టోర్నీలో భాగంగా జులై 2న బంగ్లాదేశ్‌తో టీమిండియా ఎడ్జిబాస్టన్ వేదికగా తలపడనుంది. ఈ మ్యాచ్‌లో మరోసారి విజృంభించి సెంచరీ సాధిస్తాడో చూడాలి మరి


Click it and Unblock the Notifications
