సచిన్ నుంచి పవార్ వరకు: చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మపై ప్రశంసల వర్షం

హైదరాబాద్: మొహాలీ వేదికగా శ్రీలంకతో జరిగిన రెండో వన్డేలో టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ డబుల్ సెంచరీ సాధించాడు. కేవలం 151 బంతుల్లోనే 13 ఫోర్లు, 12 సిక్సర్లతో వన్డేల్లో డబుల్ సెంచరీ చేశాడు. వన్డేల్లో రోహిత్ శర్మకు ఇది మూడో డబుల్ సెంచరీ కావడం విశేషం.
దీంతో వన్డే క్రికెట్ చరిత్రలోనే మూడో డబుల్ సెంచరీ చేసిన ఆటగాడిగా రోహిత్ శర్మ అరుదైన ఘనత సాధించాడు. గతంలో రోహిత్‌శర్మ ఆస్ట్రేలియా, శ్రీలంకపై డబుల్ సెంచరీలు చేశాడు. ఇదే శ్రీలంకపై కోల్‌కతా వేదికగా జరిగిన మ్యాచ్‌లో 264 పరుగులు చేశాడు. వన్డేల్లో ఇప్పటికీ ఇదే అత్యధిక స్కోరుగా ఉంది.
కాగా, ఈ మ్యాచ్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగిన రోహిత్ శర్మ 50 ఓవర్ల పాటు క్రీజులో ఉండి 153 బంతుల్లో 13 ఫోర్లు, 12 సిక్సులతో 208 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. దీంతో రెండో వన్డేలో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 392 పరుగులు చేసింది. దీంతో శ్రీలంకకు 393 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications