Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Rohit Sharma: ఒకే రోజు సంచలన రికార్డు.. చెత్త రికార్డు!

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు ఒకే రోజు రెండు అనుభవాలు ఎదురయ్యాయి. గొప్పగా చెప్పుకునే సంచలన రికార్డుతో పాటు ఎవరూ కోరుకోని చెత్త రికార్డును రోహిత్ నమోదుచేశాడు. ఇండోర్ వేదికగా ఆదివారం జరిగిన అఫ్గానిస్థాన్ మ్యాచ్‌లో ఈ రికార్డులు నమోదయ్యాయి. ఈ మ్యాచ్‌లో భారత్ ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

మొదట బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 172 పరుగులకు ఆలౌటైంది. గుల్బాదిన్ (57; 35 బంతుల్లో) టాప్ స్కోరర్. నజీబుల్లా (23; 21 బంతుల్లో), ముజీబ్ (21; 9 బంతుల్లో), కరీమ్ (20; 10 బంతుల్లో) రాణించారు. టీమిండియా బౌలర్లలో అర్షదీప్ సింగ్ మూడు వికెట్లు, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్ చెరో రెండు వికెట్లు తీశారు.

Rohit Sharma got Sensational record and worst record on a single day

అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన భారత్ 15.4 ఓవర్లలోనే నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. యశస్వీ జైశ్వాల్ (68; 34 బంతుల్లో), శివమ్ దూబె (63; 32 బంతుల్లో) మెరుపు అర్ధశతకాలు సాధించారు. ఈ విజయంతో మరో మ్యాచ్ మిగిలుండగానే భారత్ టీ20 సిరీస్‌ను కైవసం చేసుకుంది. అయితే భారత్ తరపున అత్యధిక టీ20 సిరీస్‌లు సాధించిన కెప్టెన్‌గా రోహిత్ చరిత్రకెక్కాడు. ఈ సిరీస్‌తో కలిపి సారథిగా హిట్ మ్యాన్ 12 సిరీస్ విజయాలు అందుకున్నాడు.

అంతేగాక 150 అంతర్జాతీయ టీ20లు ఆడిన తొలి ప్లేయర్‌గా రోహిత్ రికార్డులకెక్కాడు. 2007లో భారత్ తరపున హిట్ మ్యాన్ అరంగేట్రం చేశాడు. అంతర్జాతీయ టీ20లు ఆడిన ప్లేయర్లలో రోహిత్ తర్వాతి స్థానంలో ఐర్లాండ్ ఆటగాడు స్టిర్లింగ్ (134 మ్యాచ్‌లు) ఉన్నాడు. అయితే రెండో టీ20లో డకౌట్ అయిన రోహిత్ ఓ చెత్త రికార్డు నమోదు చేశాడు. మెన్స్ టీ20ల్లో అత్యధికసార్లు డకౌట్‌గా వెనుదిరిగిన రెండో బ్యాటర్‌గా రోహిత్ నిలిచాడు.

142 ఇన్నింగ్స్‌ల్లో రోహిత్ ఇప్పటివరకు 12 సార్లు డకౌటయ్యాడు. డకౌట్ల రికార్డులో ఐర్లాండ్ ప్లేయర్ స్టిర్లింగ్ టాప్‌లో ఉన్నాడు. 13 సార్లు పరుగులేమి చేయకుండా అతడు పెవిలియన్ నుంచి వెనుదిరిగాడు. కాగా, 14 నెలల తర్వాత టీ20ల్లో రీఎంట్రీ ఇచ్చిన రోహిత్ అఫ్గానిస్థాన్ సిరీస్‌లోని తొలి రెండు మ్యాచ్‌ల్లో డకౌటయ్యాడు. మొదటి మ్యాచ్‌లో రనౌటవ్వగా, రెండో మ్యాచ్‌లో ఎదుర్కొన్న తొలి బంతికే బౌల్డయ్యాడు.బెంగళూరు వేదికగా జనవరి 17న ఆఖరి మ్యాచ్ జరగనుంది.

Story first published: Monday, January 15, 2024, 9:01 [IST]
Other articles published on Jan 15, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+