
స్పెల్లింగ్ చెక్ చేస్కో:
ఇన్‌స్టాగ్రామ్ లైవ్ చాట్ సందర్భంగా కొందరు రోహిత్ శర్మను ఇరకాటంలో పెట్టాలని చాలా తెలివిగా ప్రశ్నలు సంధించినా.. హిట్‌మ్యాన్ కూడా అంతే తెలివిగా సమాధానమిచ్చాడు. అభిమానుల్లో ఒకరు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ గురించి ఒక్క మాటలో చెప్పమని కోరగా.. స్టార్ ఓపెనర్ తనదైన శైలిలో జవాబిచ్చాడు. దీంతో అభిమాని బిత్తర పోయాడు. ఇంతకు ఆ అభిమాని ఏమడిగాడంటే... 'Virat Kholi గురించి ఒక్క మాటలో చెప్పండి' అని అడగ్గా.. 'స్పెల్లింగ్ చెక్ చేస్కో' అని రోహిత్ పంచ్ వేసాడు.

నేను చావాలనుకుంటున్నారా?:
ప్రస్తుత క్రికెట్లో మీరు ఎవరి బ్యాటింగ్‌ను ఎక్కువ ఆస్వాదిస్తారు? అని ఓ అభిమాని అడగ్గా.. ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్, ఇంగ్లండ్ ఓపెనర్ జేసన్ రాయ్ పేర్లను రోహిత్ శర్మ చెప్పాడు. సచిన్ టెండూల్కర్, వీరేందర్ సెహ్వాగ్‌లలో మీకు ఇష్టమైన వాళ్లు ఎవరు అని ప్రశ్నించగా.. నేను చావాలనుకుంటున్నారా ఏంటి? అని చెప్పి తప్పించుకున్నాడు. సచిన్, సెహ్వాగ్ పేర్లను చెప్పకుండా ఇలా తెలివిగా సమాధానమిచ్చాడు హిట్‌మ్యాన్.

ఆ రెండూ కావాలి:
వన్డేల్లో 300, టీ20ల్లో 200 ఏది కావాలనుకుంటున్నారు? అని ఓ అభిమాని అడగ్గా.. రెండూ కావాలి అని రోహిత్ తెలిపాడు. వన్డేల్లో 300, టీ20ల్లో 200 చేయాలంటే చాలా కష్టం. కానీ చేస్తే బాగుంటుంది కదా!! అని అన్నాడు. ప్రస్తుత క్రికెట్లో ఉత్తమ ఫీల్డర్? ఎవరనగా..
న్యూజిలాండ్ ఆటగాడు మార్టిన్ గప్తిల్ అని చెప్పాడు. బరువు ఎలా తగ్గాలి? అని అడగ్గా.. మాజీ ఆఫ్ స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజా ఫొటో పెట్టి ఇతణ్ని అడగండి అని సూచించాడు.

అభిమానులు అడిగిన కొన్ని ప్రశ్నలు:
# వాంఖడేలో సిక్సులు కొట్టడం మిస్సవుతున్నావా?
రోహిత్: కచ్చితంగా
# సర్ మీ అభిమాని మిమ్మల్ని కలిసి, డిన్నర్‌కు ఆహ్వానిస్తే ఏమంటారు?
రోహిత్: ఎల్లప్పుడూ రెడీ
# మెలోడీ ఇంత చాకొలెట్‌గా ఎందుకుంది?
రోహిత్: అది చాహల్‌ను అడుగు
# చాహల్ టిక్‌టాక్ వీడియోలపై మీ స్పందన?
రోహిత్ : పిచ్చెక్కిపోతుంది
# వడాపావ్, పోహా ఇందులో ఇష్టమైంది?
రోహిత్: పోహా

వీళ్ల గురించి ఒక్క మాటలో చెప్పమంటే:
#ఎంఎస్ ధోనీ
రోహిత్: దిగ్గజం
# యువరాజ్?
రోహిత్: జట్టు కత్తిరించుకో
# కేఎల్ రాహుల్?
రోహిత్: సూపర్ (ఎమోజీ ద్వారా)
# శిఖర్ ధావన్?
రోహిత్: గబ్బర్
# హార్దిక్ పాండ్య?
రోహిత్: ప్రతిభావంతుడైన ఆటగాడు
# చెన్నై సూపర్ కింగ్స్
రోహిత్: చాలా అద్భుతమైన జట్టు
సుశాంత్ ఇంత బాధపెడతావ్ అనుకోలేదు.. హృదయం బద్ధలవుతోంది: సానియా


Click it and Unblock the Notifications
