Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

రోహిత్‌ కల నిజమైంది: రితిక

Rohit Sharma Gives Sneak Peek Of His Surreal Experience With Family At Real Madrids Stadium

మాడ్రిడ్‌: టీమిండియా ఓపెనర్ 'హిట్‌మ్యాన్‌' రోహిత్‌ శర్మకు న్యూజిలాండ్‌తో జరిగిన చివరి టీ20లో పిక్క గాయం అయిన విషయం తెలిసిందే. గాయం కారణంగా న్యూజిలాండ్‌ వన్డే, టెస్టు సిరీస్‌లకు దూరమయ్యాడు. గాయం అవ్వడంతో కివీస్ సిరీస్ మధ్య నుంచే రోహిత్ స్వదేశానికి తిరిగొచ్చేశాడు. ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్న హిట్‌మ్యాన్‌.. భార్య రితిక, కుమార్తె సమైరాలతో కలిసి సరదాగా గడుపుతున్నాడు.

కుటుంబ సమేతంగా స్పెయిన్‌కు రోహిత్

కుటుంబ సమేతంగా స్పెయిన్‌కు రోహిత్

ప్రస్తుతం గాయం నుంచి కోలుకుంటున్న రోహిత్‌ శర్మ ఇటీవల కుటుంబ సమేతంగా స్పెయిన్‌కు వెళ్లాడు. అక్కడ జరుగుతున్న ఫుట్‌బాల్‌ లీగ్‌ 'లా లిగా'లో భాగంగా రియల్‌ మాడ్రిడ్‌, బార్సిలోనా జట్లు ఆడిన మ్యాచ్‌ను వీక్షించాడు. రోహిత్ మ్యాచ్ చూస్తూ ఆనందం వ్యక్తం చేసాడు. తన కూతురు సమైరాతో అక్కడ సందడి చేసాడు. ఆదివారం రాత్రి జరిగిన ఈ మ్యాచ్‌లో రోహిత్‌ ఫేవరెట్‌ జట్టు రియల్‌ మాడ్రిడ్‌ 2-0తో బార్సిలోనాపై విజయం సాధించింది.

 ఇదో మధురజ్ఞాపకం

ఇదో మధురజ్ఞాపకం

మ్యాచ్ అనంతరం రోహిత్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో సాంటియాగో బెర్నాబూ స్టేడియంలో భార్య రితికతో కలిసి దిగిన ఫొటోను అభిమానులతో పంచుకున్నాడు. మాడ్రిడ్‌ నగరాన్ని సందర్శించడానికి అవకాశం కల్పించిన 'లా లిగా' నిర్వహాకులకు, రియల్‌ మాడ్రిడ్‌ జట్టుకు రోహిత్‌ ధన్యవాదాలు తెలిపాడు. అంతేకాదు ఈ పర్యటన అద్భుతంగా సాగిందని, ఓ మధుర జ్ఞాపకంగా మిగిలిపోయిందని రోహిత్ పేర్కొన్నాడు.

రోహిత్‌ కల నిజమైంది

రోహిత్‌ కల నిజమైంది

1992 నుంచి రియల్‌ మాడ్రిడ్‌ చిహ్నాం పరిణామ క్రమంలో వచ్చిన మార్పులతో పాటు ఆ స్టేడియంలోని చారిత్రక టన్నెల్‌ను రోహిత్ సందర్శించాడు. దీనికి సంబందించిన వీడియోలను హిట్‌మ్యాన్‌ ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో పోస్టు చేశాడు. మరోవైపు రితిక సైతం స్పెయిన్‌ పర్యటన పట్ల సంతోషం వ్యక్తం చేసింది. 'రోహిత్‌ కల నిజమైంది' అని తన ఇన్‌స్టా స్టోరీస్‌లో రాసుకొచ్చింది.

దక్షిణాఫ్రికా సిరీస్‌లో పునరాగమనం

దక్షిణాఫ్రికా సిరీస్‌లో పునరాగమనం

ప్రస్తుతం గాయం నుంచి కోలుకుంటున్న రోహిత్‌ శర్మ మార్చి 12 నుంచి దక్షిణాఫ్రికాతో జరగబోయే మూడు వన్డేల సిరీస్‌లో ఆడే అవకాశాలు ఉన్నాయని సమాచారం. ఇటీవలే కివీస్‌తో ముగిసిన వన్డే, టెస్ట్ సిరీస్‌లలో హిట్‌మ్యాన్‌ లేని లోటు స్పష్టంగా కనిపించింది. అద్భుత ఫామ్‌లో ఉన్న రోహిత్ జట్టులో లేకపోవడం కివీస్‌కు సానుకూలాంశంగా మారింది. హిట్‌మ్యాన్‌ జట్టులో ఉంటే వన్డే, టెస్ట్ సిరీస్‌లను భారత్ కోల్పోయే అవకాశాలు చాలా తక్కువ అని విశ్లేషకులు భావిస్తున్నారు.

Story first published: Tuesday, March 3, 2020, 15:33 [IST]
Other articles published on Mar 3, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+