INDvsAUS : తొలి టెస్టు ఆడే జట్టుపై హింటిచ్చిన రోహిత్.. గిల్ డౌటేనా?

ఆస్ట్రేలియాతో జరిగే కీలకమైన టెస్టు సిరీస్‌లో టీమిండియా ఎంపికపై తెగ చర్చలు జరుగుతున్నాయి. ఓపెనర్‌గా రోహిత్‌తో జత కట్టేది ఎవరు? మిడిలార్డర్‌లో పంత్ స్థానాన్ని భర్తీ చేసే డ్యాషింగ్ బ్యాటర్ ఎవరు? అని చర్చలు జరుగుతూనే ఉన్నాయి. నిన్నమొన్నటి వరకు పలువురు మాజీలు, క్రికెట్ నిపుణులు అందరూ కూడా శుభ్‌మన్ గిల్‌ను తమ మొదటి చాయిస్ ఓపెనర్‌గా తీసుకున్నారు. అయితే వెటరన్ ప్లేయర్ కేఎల్ రాహుల్ తిరిగి రావడంతో గిల్ స్థానం ప్రశ్నార్థకమైంది.

ఓపెనర్ కన్ఫర్మ్..?
తన కెరీర్‌లో బెస్ట్ ఫామ్‌లో ఉన్న గిల్ చివరగా ఆడిన టెస్టు సిరీసులో కూడా బంగ్లాపై సెంచరీ బాదాడు. అదే సిరీసులో కేఎల్ రాహుల్ దారుణంగా విఫలమయ్యాడు. రెండు టెస్టుల్లో కలిపి కేవలం 57 పరుగులు మాత్రమే చేశాడు. ఆ సిరీస్ తర్వాత కూడా గిల్.. ఫార్మాట్‌తో సంబంధం లేకుండా పరుగుల వరద పారిస్తూనే ఉన్నాడు. ఈ క్రమంలో అతన్నే ఓపెనర్‌గా తీసుకోవాలని పలువురు అంటున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా మీడియాతో మాట్లాడిన టీమిండియా సారధి రోహిత్ శర్మ జట్టు ఎంపికపై పెద్ద హింట్ ఇచ్చేశాడు.

గిల్ వర్సెస్ సూర్య
యువ ఓపెనర్ గిల్‌ను తెగ మెచ్చుకున్నాడు రోహిత్. 'గిల్ ప్రస్తుతం సుప్రీం ఫామ్‌లో ఉన్నాడు. చాలా భారీ సెంచరీలు చేశాడు' అని కొనియాడాడు. అదే సమయంలో జట్టులో సూర్యకుమార్ తీసుకొచ్చే రేంజ్ గురించి కూడా మాట్లాడాడు. 'జట్టు రేంజ్‌లో సూర్య తీసుకొచ్చే మార్పులు ఏంటో తను ఇప్పటికే చూపించేశాడు. కానీ ఎవరిని ఆడించాలనే విషయంలో మేం ఒక నిర్ణయానికి ఇంకా రాలేదు' అని రోహిత్ అన్నాడు. అంటే ఓపెనర్‌గా రాహుల్ కన్ఫర్మ్ కాగా.. మిడిలార్డర్‌లోనే గిల్, సూర్య మధ్య ఒక స్థానం కోసం పోటీ నెలకొంది.

పంత్‌ను మిస్ అవుతాం..
అదే సమయంలో యాక్సిడెంట్‌లో గాయపడి జట్టుకు దూరమైన రిషభ్ పంత్ గురించి కూడా రోహిత్ మాట్లాడాడు. 'మేం పంత్ సేవలను కచ్చితంగా మిస్ అవుతాం. అయితే అతని స్థానాన్ని భర్తీ చేయగల ఆటగాళ్లు మా దగ్గర ఉన్నారు. ఈ విషయం గురించి బ్యాటర్లతో చక్కగా చర్చించాం. వాళ్ల ప్లాన్లు ఏంటి? ఏం చెయ్యాలని అనుకుంటున్నారు? అడిగి తెలుసుకున్నాం. వాటిని గురువారం నుంచి చక్కగా అమలు చేస్తామని ఆశిస్తున్నా' అని రోహిత్ పేర్కొన్నాడు. రోహిత్ మీటింగ్ తర్వాత భారత జట్టు ఎంపికపై ఒక అంచనా వచ్చిందని కొందరు నిపుణులు అంటున్నారు.
భారత తుది జట్టు (అంచనా): రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్, ఛటేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్/శుభ్‌మన్ గిల్, కేఎస్ భరత్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications