మీరిచ్చే సలహా: పాక్ జర్నలిస్ట్‌కి దిమ్మదిరిగే సమాధానమిచ్చిన రోహిత్

హైదరాబాద్: పాకిస్థాన్‌తో విజయానంతరం ప్రెస్ కాన్ఫరెన్స్‌కు హాజరైన టీమిండియా వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ నవ్వులు పూయించాడు. ఆదివారం మాంచెస్టర్ వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో టీమిండియా 89 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
ఈ మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగి టీమిండియా విజయంలో కీలకపాత్ర పోషించిన రోహిత్‌కు 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డు లభించింది. మ్యాచ్ అనంతరం జరిగిన మీడియా సమావేశంలో రోహిత్‌శర్మకు పాకిస్థాన్‌కు చెందిన జర్నలిస్ట్ నుంచి ఓ ప్రశ్న ఎదురైంది. ఈ ప్రశ్నకు సమయస్ఫూర్తితో వ్యవహారించి నవ్వులు పూయించాడు.

అసలేం జరిగింది?
ఈ మధ్య కాలంలో పాక్ బ్యాట్స్‌మెన్ పేలవ ప్రదర్శనతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఈ విషయం వాళ్ల ఫలితాల్లో కనిపిస్తుంది. ఈ సందర్భంగా వారికి మీరిచ్చే సలహా ఏంటి? అని పాక్ జర్నలిస్ట్ అడగ్గా... రోహిత్ నవ్వుతూ "నేను పాకిస్థాన్ కోచ్ అయితే తప్పకుండా సలహా ఇస్తా. ఇప్పుడేం చెప్పగలను?" అని అన్నాడు.

రోహిత్ శర్మ నుంచి ఊహించని రీతిలో
రోహిత్ శర్మ నుంచి ఊహించని రీతిలో సమాధానం రావడంతో అక్కడున్నవారంతా ఒక్కసారిగా నవ్వుకున్నారు. ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచకప్‌లో రోహిత్ శర్మ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. సఫారీలతో జరిగిన తొలి మ్యాచ్‌లో సెంచరీతో చేలరేగగా... అనంతరం ఆసీస్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ సాధించాడు.

వర్షం కారణంగా మ్యాచ్ రద్దు
ఇక, న్యూజిలాండ్‌తో జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయింది. కాగా, ఆదివారం నాటి మ్యాచ్‌లో రోహిత్ శర్మ సెంచరీ సాధించడంతో అనేక రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. భారత్ తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా రోహిత్ శర్మ(358 సిక్సర్లు) చరిత్ర సృష్టించాడు.

ధోనీని వెనక్కి నెట్టిన రోహిత్
ఈ క్రమంలో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని(355)ని వెనక్కి నెట్టాడు. ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌పై సెంచరీ చేసిన రెండో బ్యాట్స్‌మెన్‌గా రోహిత్ శర్మ చరిత్రకెక్కాడు. 2015లో విరాట్ కోహ్లీ (107) తొలి సెంచరీని నమోదు చేశాడు. ప్రపంచకప్‌లో మొదటి మూడు మ్యాచ్‌ల్లో 50 కంటే ఎక్కువ పరుగులు చేసిన నాలుగో భారత బ్యాట్స్‌మన్ రోహిత్ శర్మ.

పాక్‌పై అత్యధిక వ్యక్తిగత స్కోరు
1987లో సిద్ధు, 1996లో సచిన్ టెండూల్కర్, 2011లో యువరాజ్ సింగ్ ఈ ఘనత సాధించారు. పాక్‌పై అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన భారత బ్యాట్స్‌మన్‌గా రోహిత్ శర్మ నిలిచాడు. విరాట్ కోహ్లీ(107), సయిద్ అన్వర్(101) ఆ తర్వాత స్థానాల్లో ఉన్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications