Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Rohit Sharma: తన సెంటిమెంట్ కారును గిఫ్ట్‌గా ఇచ్చిన రోహిత్ శర్మ

Rohit Sharma: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 ప్రారంభంలో ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ రోహిత్ శర్మ తనకు ఎంతో ఇష్టమైన నీలం రంగు లాంబోర్గిని ఉరుసు కారును పోటీ విజేతకు బహుమతిగా ఇచ్చాడు. సుమారు రూ.4 కోట్ల విలువైన ఈ కారు '264'అనే నంబర్ ప్లేట్‌తో రోహిత్ శర్మకు ఎంతో ప్రత్యేకమైనది. హిట్ మ్యాన్ రోహిత్ శర్మ తన నీలం రంగు లాంబోర్గిని ఉరుస్‌ను విజేతకు అందజేస్తానని ఓ ప్రకటనలో ముందుగానే ప్రకటించారు. ఈ కారు రోహిత్‌కు ఎంతగానో సెంట్‌మెంట్‌గా ఉండటంతో ఆయన తన మాటను వెనక్కు తీసుకుంటారని చాలా మంది భావించారు. కానీ అందరి అంచనాలను తలకిందుగా చేస్తూ రోహిత్ శర్మ తాను ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. విజేత కుటుంబంతో రోహిత్ శర్మ కలిసి ఫోటోలు దిగి కారు తాళాలను స్వయంగా అందజేశారు.

Rohit Sharma Gifts His Sentimental Lamborghini Urus with 264 Number Plate

264 నంబర్ ప్లేట్ వెనుక రహస్యం ఇదే..
ఈ లాంబోర్గిని కారు రోహిత్ శర్మకు ఎంతో ప్రత్యేకమైనది. దానికి ముఖ్యకారణం ఆ కారు నంబర్ ప్లేట్. 2014లో శ్రీలంకపై సాధించిన రికార్డు స్కోరు 264కు గుర్తుగా.. రోహిత్ శర్మ కారు నంబర్ '264' అద్భుతమైన కెరీర్ జ్ఞాపకానికి ప్రతీకగా నిలిచింది. 2014లో శ్రీలంకపై కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో రోహిత్ శర్మ 264 పరుగులు చేసి ప్రపంచ రికార్డు సృష్టించాడు. అప్పటి నుంచి రోహిత్ శర్మకు ఆ స్కోరు కెరీర్‌లో మైలురాయిగా నిలిచింది. అలాంటి కారును బహుమతిగా ఇవ్వడం అనేది కేవలం మాట నిలబెట్టుకోవడమే కాకుండా రోహిత్ శర్మకు అభిమానులు పట్ల ఉన్న నిబద్ధత, ఉదారతను చాటింది.

Story first published: Tuesday, May 20, 2025, 14:03 [IST]
Other articles published on May 20, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+