Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సిక్సర్ తగిలింది.. అభిమానికి హిట్‌మ్యాన్‌ సర్‌ప్రైజ్‌

Rohit Sharma gifts autographed hat to fan who got hit by his six

భారత ఓపెనర్, హిట్‌మ్యాన్‌ రోహిత్ శర్మ ఈ ప్రపంచకప్‌లో సెంచరీల మోత మోగిస్తున్నాడు. బర్మింగ్‌హామ్‌ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ శర్మ 90 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్సుల సాయంతో సెంచరీని నమోదు చేశాడు. దీంతో ఒక ప్రపంచకప్‌లో అత్యధిక సెంచరీలు సాధించిన శ్రీలంక మాజీ క్రికెట్ దిగ్గజం కుమార్ సంగక్కర (4 సెంచరీలు) రికార్డుని సమం చేశాడు. ఇక ప్రపంచకప్‌లో రోహిత్ శర్మకు ఇది ఐదో సెంచరీ. రోహిత్ క‌న్నా ముందు స‌చిన్ టెండూల్క‌ర్ ఆరు సెంచరీలతో ముందున్నాడు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

సిక్సర్ తగిలింది:

రోహిత్ ఒకవైపు పరుగుల సునామీ సృష్టిస్తూ .. మరోవైపు తన మంచి మనుసుతో అభిమానుల హృదయాలను గెలుచుకుంటున్నాడు. ఈ క్రమంలోనే రోహిత్‌ శర్మ ఓ అభిమానిని సర్‌ప్రైజ్‌ చేశాడు. విషయంలోకి వెళితే... మంగళవారం బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ సిక్సర్ల మోత మోగించాడు. ఈ క్రమంలో రోహిత్‌ కొట్టిన ఓ సిక్సర్‌ ఓ మహిళా అభిమానికి తగిలింది. సెంచరీ అనంతరం పెవిలియన్‌ చేరేటప్పుడు ఆగి.. తను కొట్టిన బంతి ఎవరికి తగిలిందో చెప్పాల్సిందిగా కోరాడు.

కానుకగా టోపీ:

కానుకగా టోపీ:

మ్యాచ్‌ పూర్తయిన అనంతరం రోహిత్‌ ఆమెను పరామర్శించారు. తన జ్ఞాపకంగా ఆ అభిమానికి సంతకం చేసిన టోపీని కానుకగా ఇచ్చారు. ఆమెతో కలిసి ఫొటోలకు పోజులిచ్చారు. ఈ ఫొటోలను బీసీసీఐ తన ట్విటర్‌ ఖాతాలో పోస్ట్ చేసింది. దీంతో ఇవి వైరల్‌ అవుతున్నాయి. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు హిట్‌మ్యాన్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అందుకే రోహిత్‌కి అభిమానులు ఎక్కువ అంటూ పొగిడేస్తున్నారు.

ఉత్కంఠ విజయం:

ఈ మ్యాచ్‌లో టీమ్‌ఇండియా 28 పరుగుల తేడాతో ఉత్కంఠ విజయం సాధించింది. రోహిత్‌ శర్మ (104) రికార్డు సెంచరీ చేయగా.. కేఎల్ రాహుల్ (77) రాణించడంతో భారత్‌ 50 ఓవర్లలో 9 వికెట్లకు 314 పరుగులు చేసింది. ఛేదనలో బంగ్లా 48 ఓవర్లలో 286 పరుగులకు ఆలౌటైంది. షకీబ్ (66), సైఫుద్దీన్ (51 నాటౌట్) పోరాటం వృథా అయ్యింది. బుమ్రా 4, హార్దిక్ 3 వికెట్లు తీశారు. సెంచరీ చేసిన రోహిత్ 'మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్' అవార్డు దక్కించుకున్నాడు.

Story first published: Wednesday, July 3, 2019, 11:50 [IST]
Other articles published on Jul 3, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+