
హైదరాబాద్: దక్షిణాఫ్రికా భారత్‌ల రెండో టీ 20 మ్యాచ్ బుధవారం జరిగింది. ఈ మ్యాచ్‌లో సఫారీ జట్టు వికెట్ కీపర్ డుమినీ చెలరేగి ఆడటంతో ఆరు వికెట్ల తేడాతో ఇంకా ఓవర్లు మిగిలి ఉండగానే జట్టు విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత జట్టు 188పరుగులకే పరిమితమైంది. భారత జట్టు ఓపెనర్ రోహిత్ శర్మ సఫారీ బౌలర్ల చేతికి యథావిధిగా చిక్కాడు. ఈ సారి అంతకుముందు కంటే ఘోరంగా ఔట్ అయ్యాడు.
మ్యాచ్ మొదలైన తొలి బంతికే డకౌట్ అయిన రోహిత్ శర్మ చెత్త రికార్డును నమోదు చేశాడు. టీ 20ల్లో ఇప్పటికే నాలుగు సార్లు డకౌట్ అయిన రోహిత్ జాబితాలో ప్రథమ స్థానంలోకి పడిపోయాడు. అతని తర్వాత బౌలర్లు ఆశిష్ నెహ్రా, యూసఫ్ పఠాన్ ఉన్నారు. దీంతో రోహిత్ శర్మపై ఆవేశంతో చెలరేగిపోయిన నెటిజన్లు రోహిత్‌పై ట్వీట్ల దుమారాన్ని లేపారు.
'రోహిత్ శర్మ తిరిగొచ్చేశాడు. మళ్లీ గోల్డెన్ డకౌట్ అయ్యాడు'
'అవుట్ అవుతాడనుకున్నా. కానీ, ఇంత త్వరగా అవుతాడని అనుకోలేదు'
'బ్యాట్స్‌మెన్ ఆఫ్ డే రోహిత్ గోల్డెన్ డక్, బౌలర్ ఆఫ్ డే చాహల్ హాఫ్ సెంచరీ'
'ఈ సిరీస్ లో అతనికి దక్కినదేమైనా ఉంటే అది ఈ గోల్డెన్ డక్ మాత్రమే'
టీ 20జాబితాలో ఎక్కువ డకౌట్ అయిన భారత ఆటగాళ్ల జాబితాలో రోహిత్ శర్మ చేరాడు. 2010 లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో మురళీ విజయ్, 2016లో పాకిస్థాన్‌తో అజింకా రహానె, 2016లోనే జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో కేఎల్ రాహుల్. భారత దక్షిణాఫ్రికాల మధ్య మూడో టీ20 శనివారం కేప్‌టౌన్‌లో జరగనుంది.