రోహిత్ వెన్నుతట్టాడు: కోహ్లీ క్రీడాస్ఫూర్తిపై నెటిజన్ల ప్రశంసలు (వీడియో)

హైదరాబాద్: విశాఖ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో ఓపెనర్లు రోహిత్ శర్మ, మయాంక్ అగర్వాల్‌లు చెలరేగడంతో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు చేసింది. ముఖ్యంగా ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మను జట్టు మేనేజ్‌మెంట్ ఓపెనర్‌గా బరిలోకి దింపడంతో తనదైన శైలి ఆట ఆడుతూ రోహిత్ శర్మ అద్భుత ప్రదర్శన చేశాడు.
తొలి రోజు రోహిత్ శర్మ సెంచరీతో రాణించగా... రెండో రోజైన బుధవారం మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ డబుల్ సెంచరీతో సాధించాడు. అయితే, జట్టు స్కోరు 317 పరుగుల వద్ద రోహిత్ శర్మ(244 బంతుల్లో 176, 23 ఫోర్లు, 6 సిక్సులు) సఫారీ బౌలర్ మహరాజ్ బౌలింగ్‌లో వికెట్ కీపర్ క్వింటన్ డీకాక్ స్టంపౌట్ చేశాడు.

రోహిత్ శర్మ అరుదైన ఘనత
దీంతో రోహిత్ శర్మ నిరాశగా పెవిలియన్‌కు చేరడంతో టీమిండియా 317 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యానికి తెరపడింది. ఫలితంగా శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్, పృథ్వీ షా తర్వాత ఓపెనర్‌గా బరిలోకి దిగిన తొలి ఇన్నింగ్స్‌లోనే సెంచరీ చేసిన నాలుగో భారత బ్యాట్స్‌మన్ రోహిత్ శర్మ అరుదైన ఘనత సాధించాడు.
మూడు ఫార్మాట్లలో ఓపెనర్‌గా సెంచరీలు
అంతేకాదు ఓపెనర్‌గా వచ్చి మూడు ఫార్మాట్లలో (టి20, వన్డే, టెస్టు) సెంచరీలు చేసిన తొలి భారత క్రికెటర్ రోహిత్ రికార్డు సృష్టించాడు. అయితే, రోహిత్ శర్మ ఔటైన తర్వాత డ్రెస్సింగ్ రూమ్‌లోకి వెళ్లే సమయంలో జట్టు మొత్తం చప్పట్లు కొడుతూ అతడికి గ్రాండ్ వెల్‌కమ్ చెప్పడం విశేషం.
కోహ్లీ ప్రదర్శించిన క్రీడాస్పూర్తిపై నెటిజన్లు
కెప్టెన్ విరాట్ కోహ్లీ అయితే, ఒక అడుగు ముందుకు వేసి డ్రెస్సింగ్ రూమ్‌లోకి వస్తోన్న రోహిత్ శర్మను వెన్ను తట్టాడు. అనంతరం డ్రెస్సింగ్ రూమ్ డోర్ మూసివేశాడు కూడా. ఓపెనర్‌గా రోహిత్ శర్మ తొలి టెస్టులోనే సెంచరీ సాధించచడంపై కోహ్లీ ప్రదర్శించిన క్రీడాస్పూర్తిని నెటిజన్లు ప్రశంసలతో ముంచెత్తారు. దీనికి సంబంధించిన వీడియోను భారత క్రికెట్ జట్టు పేరిట ఉన్న ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేయడంతో వైరల్‌గా మారింది.
39 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి సఫారీలు
రెండో రోజైన గురువారం ఆట ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా 20 ఓవర్లకు గాను 3 వికెట్లు కోల్పోయి 39 పరుగులు చేసింది. డీఎన్ ఎల్గర్ (27), తెంబా బవుమా (2) నైట్ వాచ్‌మన్ క్రీజులో ఉన్నారు. దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్లలో ఓపెనర్ ఐడెన్ మార్‌క్రమ్ (5), డి బ్రూన్ (4) తక్కువ స్కోర్లకే పెవిలియన్‌కు చేరగా... డేన్ పీడ్ (0) డకౌట్ అయ్యాడు. భారత బౌలర్లలో సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ 2 వికెట్లు తీయగా... జడేజాకు ఒక వికెట్ లభించింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications