'మా ఆవిడ చూస్తోందమ్మా.. నీకో దణ్ణం, నన్నొదిలేయ్!': స్మృతి, రోహిత్ లైవ్ వీడియో
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు కాస్త మతిమరుపు ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ విషయాన్ని రోహిత్ టీమ్ మేట్స్ పలు సందర్భాల్లో చెప్పారు. తాజాగా ముంబలో జరిగిన బీసీసీఐ నమన్ అవార్డుల ప్రదానోత్సవంలో ఈ మతిమరుపు విషయం గురించి మరోసారి ప్రస్తావన రాగా, దీనికి రోహిత్ ఆసక్తికరమైన సమాధానం చెప్పి నవ్వులు పూయించాడు.
ఈ ఈవెంట్ లో మహిళా ప్లేయర్ స్మృతి మంధాన - రోహిత్ శర్మకు మధ్య స్టేజ్ పై సరదా సంభాషణ కొనసాగింది. ఇందులో భాగంగా స్మృతి.. రోహిత్ ను మతిమరుపు సమస్య గురించి అడిగింది. 'ఈ మధ్య కాలంలో మీ టీమ్ మేట్స్ .. మీకున్న హాబీల్లో ఏ విషయమై ఆటపట్టించారు' అని ప్రశ్నించింది.

"మతిమరుపు విషయమై నా టీమ్‌మేట్స్ ఎక్కువగా సరదాగా టీజ్ చేస్తుంటారు. కానీ నిజానికి అది నా హాబీ కాదు. రీసెంట గా వాళ్లు .. నేను నా వ్యాలెట్, పాస్‌పోర్ట్ మర్చిపోయానని టీజ్ చేశారు. కానీ అందులో నిజం లేదు. అది ఎప్పుడో పదేళ్ల క్రితం జరిగింది." అని హిట్ మ్యాన్ నవ్వుతూ సమాధానమిచ్చాడు.
'మరి మీ జీవితంలో ఇప్పటివరకు మర్చిపోయిన అతి పెద్ద విషయం ఏమైనా ఉందా?' అని స్మృతి మంధాన మరో ప్రశ్న అడిగింది. "నేను అది చెప్పలేను(నవ్వుతూ). ఎందుకంటే ఈ ఈవెంట్ ను నా భార్య లైవ్‌లో చూస్తుంటుంది. అందుకే ఈ విషయాన్ని నా మనసులోనే దాచుకుంటా " అని హిట్‌మ్యాట్ మరోసారి నవ్వులు చిందించాడు.
ఇక తాజాగా జరిగిన బీసీసీఐ నమన్ అవార్డుల ప్రదానోత్సవంలో.. ఉత్తమ అంతర్జాతీయ మహిళా క్రికెటర్ గా,
వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన మహిళా క్రికెటర్ గా స్మృతి మంధాన అవార్డులను అందుకుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications