వాంఖడే వేదికగా ఆదివారం చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 20 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లకు 206 పరుగులు చేసింది. రుతురాజ్ గైక్వాడ్ (69; 40 బంతుల్లో, 5x 4, 5x6), శివమ్ దూబె (66*; 38 బంతుల్లో, 10x4, 2x6) అర్ధశతకాలతో సత్తాచాటారు.ఆఖరి ఓవర్లో క్రీజులోకి వచ్చిన ఎంఎస్ ధోనీ (20*; 4 బంతుల్లో, 3x6) సిక్సర్లతో విరుచుకుపడ్డాడు.
అనంతరం ముంబై ఇండియన్స్ 20 ఓవర్లకు ఆరు వికెట్లు కోల్పోయి 186 పరుగులే చేసింది. రోహిత్ శర్మ (105*; 63 బంతుల్లో, 11x4, 5x6) అజేయ శతక పోరాటం వృథాగా మారింది. తిలక్ వర్మ (31; 20 బంతుల్లో, 5x4) సెకండ్ టాప్ స్కోరర్. పతిరన నాలుగు ఓవర్లలో 28 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు.

అయితే సీఎస్కే చేతిలో ముంబై ఓడినప్పటికీ రోహిత్ అరుదైన రికార్డు సాధించాడు. టీ20 క్రికెట్‌లో భారత్ తరఫున 500 సిక్సర్లు బాదిన ఏకైక బ్యాటర్‌గా రోహిత్ చరిత్రకెక్కాడు. జడేజా బౌలింగ్‌లో స్లాగ్ స్వీప్‌తో బంతిని స్టాండ్స్‌కు తరలించి ఈ ఘనత అందుకున్నాడు. టీ20ల్లో ఓవరాల్‌గా అత్యధిక సిక్సర్ల సాధించిన అయిదో ప్లేయర్‌గా రోహిత్ రికార్డు నెలకొల్పాడు.
అత్యధిక సిక్సర్లు బాదిన జాబితాలో క్రిస్ గేల్ అగ్రస్థానంలో ఉన్నాడు. గేల్ 1056 సిక్సర్లు కొట్టాడు. గేల్ తర్వాతి స్థానాల్లో వరుసగా కీరన్ పొలార్డ్ (860), అండ్రీ రసెల్ (678), కొలిన్ మన్రో (548), రోహిత్ శర్మ (500) ఉన్నారు. కాగా, హిట్ మ్యాన్ మరో రికార్డు సాధించాడు. ముంబై ఇండియన్స్ తరఫున అత్యధిక సెంచరీలు సాధించిన ఆటగాడిగా నిలిచాడు. 2012లో కేకేఆర్‌పై శతకం సాధించిన రోహిత్ 12 ఏళ్ల తర్వాత ఐపీఎల్‌లో మూడంకెల స్కోరు అందుకున్నాడు. ముంబై ఇండియన్స్ తరఫున ఇప్పటివరకు ఏడు సెంచరీలు నమోదయ్యాయి. రోహిత్ రెండు, సనత్ జయసూర్య, సూర్యకుమార్ యాదవ్, సచిన్ టెండూల్కర్, సిమన్స్, కామెరూన్ గ్రీన్ తలో శతకం సాధించారు.