
మాంఛెస్టర్: టీమిండియా డాషింగ్ ఓపెనర్ రోహిత్ శర్మను ఎప్పుడూ హిట్‌మ్యాన్‌గానే చూస్తుంటారు అభిమానులు. అతణ్ని కళాకారుడని దృష్టిలో ఎప్పుడూ చూడలేదు. ప్రోత్సహించనూ లేదు జనం. అతనిలో మాంఛి కళాకారుడు కూడా ఉన్నాడనే విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. ప్రపంచకప్ టోర్నమెంట్‌లో భాగంగా సౌతాంప్టన్‌లోని రోజ్‌బౌల్ స్టేడియంలో శనివారం ఆఫ్ఘనిస్తాన్‌తో మ్యాచ్ ముగిసిన అనంతరం.. మాంఛెస్టర్‌కు రైలులో బయలుదేరింది టీమిండియా.
మాంఛెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫొర్డ్ స్టేడియంలో ఈ నెల 30వ తేదీన ఇంగ్లండ్ జట్టుతో తలపడాల్సి ఉంది.సౌతాంప్టన్ నుంచి మాంఛెస్టర్ మధ్య రైలు ప్రయాణం సుమారు అయిదు గంటలు. ఈ అయిదు గంటల ప్రయాణం సమయంలో మనోళ్లకు బాగా బోర్ కొట్టినట్టుంది. అందుకే ఒక్కొక్కరు ఒక్కో రకంగా తమలోని కళాకారుడిని బయటికి రప్పించారు.
ఈ సందర్భంగా- రోహిత్ శర్మ మూకాభినయాన్ని ప్రదర్శించారు. మూకాభినయంలో అదర గొట్టారు. దీనికి సంబంధించిన ఓ వీడియోను రోహిత్ శర్మ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. అయిదు గంటల ప్రయాణం. ఓ చిన్న నెట్‌ఫ్లిక్స్‌లాంటి ప్రయత్నం..అని దానికి క్యాప్షన్‌ను జోడించారు. చేతులు ఊపుతూ, సైగలు చేస్తూ ఏదో విషయాన్ని చెప్పడానికి ప్రయత్నిస్తుండగా.. దినేష్ కార్తిక్ దాన్ని మాటలతో చెప్పడం కనిపించింది.