
హైదరాబాద్: భారత్‌లో జరిగిన అన్ని మ్యాచ్‌లలో దూకుడు ప్రదర్శించిన రోహిత్ శర్మ సఫారీ గడ్డపై ఇప్పటికీ ఐదు మ్యాచ్‌లు జరిగినా రాణించలేకపోయాడు. చివరికి ఆదివారం జరిగిన మ్యాచ్‌లో కూడా కేవలం 15పరుగులకే పరిమితమై పెవిలియన్ బాట పడ్డాడు. దీంతో రోహిత్‌ను నెటిజన్లు జోకులతో ఆడుకుంటున్నారు.
విదేశీ పిచ్‌లపై అతడు పదేపదే విఫలం అవుతుండటంతో అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతేడాది రోహిత్ ఎంత అద్భుతంగా ఆడాడో అందరికీ తెలిసిందే. విరాట్ కోహ్లీ తర్వాత అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా నిలిచాడు.
స్వదేశంలో ఫామ్ ఆధారంగా విదేశాల్లో రహానె బదులు జట్టులోకి ఎంపికైన రోహిత్ దక్షిణాఫ్రికాలో ఘోరంగా విఫలం అయ్యాడు. టెస్టులతో పాటు వన్డేల్లోనూ నిలవలేదు. సఫారీలపై రెండు టెస్టులో అతడు 11, 10; 10, 47 పరుగులు చేశాడు. ఇక రెండు వన్డేల్లో 20, 15తోనే పెవిలియన్ చేరుకున్నాడు. ఆదివారం జరిగిన రెండో వన్డేలో విఫలం కావడంతో రోహిత్‌పై ట్విటర్‌లో జోకులు, సెటైర్లు వేస్తున్నారు.
'రోహిత్ శర్మ తన జూనియర్లు కోహ్లీ, రహానెకు అవకాశాలు ఇచ్చేందుకు ఇలా చేస్తున్నాడు; రోహిత్ శర్మ 185 పరుగుల తేడాతో తన ద్విశతకానికి చేజార్చుకున్నాడు; రోహిత్ ఇద్దరు బ్యాట్స్‌మెన్ ప్రతిభను వృథా చేస్తున్నాడు. మొదట అతనిది. మరొకరు జట్టులోకి రాకుండా రెండోవాడిది' అంటూ అభిమానులు వ్యాఖ్యలు, వ్యంగ్య చిత్రాలు పెడుతున్నారు.