Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

వార్మప్ మ్యాచ్‌లో అరుదైన సన్నివేశాలు: బుమ్రా బౌలింగ్‌లో రోహిత్ శర్మ

Rohit sharma faces Bumrah bowling in warm up match against Leicestershire

ముంబై: భారత క్రికెట్ జట్టు ఇంగ్లాండ్ గడ్డపై తన ప్రస్థానాన్ని ఆరంభించింది. తొలి టెస్ట్ కంటే ముందు ఓ ప్రాక్టీస్ మ్యాచ్‌ను ఆడుతోంది. లీసెస్టర్‌షైర్ కౌంటీ క్లబ్‌తో ఈ వార్మప్ మొదలైంది. లీసెస్టర్‌షైర్ కౌంటీ క్రికెట్ క్లబ్ అధికారిక యూట్యూబ్ ఛానల్ ఫాక్సెస్ దీన్ని ప్రత్యక్ష ప్రసారం చేస్తోంది. నాలుగు రోజుల పాటు జరిగే వార్మప్ మ్యాచ్ ఇది. టీమిండియా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. 15 ఓవర్లు ముగిసే సమయానికి రెండు వికెట్ల నష్టానికి 50 పరుగులు చేసింది.

 క్రీజ్‌లో వారిద్దరూ..

క్రీజ్‌లో వారిద్దరూ..

వన్ డౌన్ బ్యాటర్ హనుమ విహారి, టాప్ ఆర్డర్‌లో ఎంట్రీ ఇచ్చిన విరాట్ కోహ్లీ క్రీజ్‌లో ఉన్నారు. హనుమ విహారి -3, విరాట్ కోహ్లీ-0 పరుగులతో ఆడుతున్నారు. ఓపెనర్లు ఇద్దరూ తక్కువ పరుగులకే పెవిలియన్ చేరారు. కేప్టెన్ రోహిత్ శర్మ 25 పరుగులు చేశాడు. ఇందులో మూడు ఫోర్లు ఉన్నాయి. సుదీర్ఘ విరామం అనంతరం క్రీజ్‌లో అడుగుపెట్టిన రోహిత్ శర్మ.. క్లీన్ హిట్స్ కొట్టాడు. రోమన్ వాకర్ బౌలింగ్‌లో సబ్‌స్టిట్యూట్ ఆటగాడు సకండేకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.

 50 పరుగులకు రెండు వికెట్లు..

50 పరుగులకు రెండు వికెట్లు..

మరో ఓపెనర్ శుభ్‌మన్ గిల్ నాలుగు ఫోర్లతో 21 పరుగులు చేశాడు. విల్ డేవిస్ బౌలింగ్‌లో వికెట్ కీపర్ రిషభ్ పంత్‌కు క్యాచ్ ఇచ్చి శుభ్‌మన్ గిల్ పెవిలియన్ చేరాడు. జట్టు స్కోరు 35 పరుగుల వద్ద శుభ్‌మన్ గిల్, 50 పరుగుల వద్ద రోహిత్ శర్మ అవుట్ అయ్యారు. కాగా- లీసెస్టర్‌షైర్ జట్టులో టీమిండియాకు చెందిన నలుగురు ఆటగాళ్లు ఆడుతున్నారు. బౌలర్లు జస్‌ప్రీత్ బుమ్రా, ప్రసిద్ధ్ కృష్ణ,

వికెట్ కీపర్ రోహిత్ శర్మ, చేతేశ్వర్ పుజారా ప్రత్యర్థి జట్టులో ఉన్నరు.

 బుమ్రా బౌలింగ్‌లో..

బుమ్రా బౌలింగ్‌లో..

లీసెస్టర్‌షైర్ తరఫున బౌలింగ్‌ను జస్‌ప్రీత్ బుమ్రా ప్రారంభించడం ఈ మ్యాచ్ ప్రత్యేకత. బుమ్రా బౌలింగ్‌ను ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. తొలి సెషన్‌లో అయిదు ఓవర్లు సంధించిన బుమ్రా 20 పరుగులు ఇచ్చుకున్నాడు. వికెట్లేమీ తీసుకోలేదు. విల్ డేవిస్, రోమన్ వాకర్ తలో వికెట్ పంచుకున్నారు. ప్రసిద్ధ్ కృష్ణ కూడా నాలుగు ఓవర్లల్లో తొమ్మిది పరుగులు ఇచ్చాడు. పొదుపుగా బౌలింగ్ చేశాడు. ఈ నాలుగు ఓవర్లల్లో ఒకటి మెయిడెన్.

1న టెస్ట్ మ్యాచ్..

1న టెస్ట్ మ్యాచ్..

జులై 1వ తేదీ నుంచి భారత్-ఇంగ్లాండ్ మధ్య ప్రతిష్ఠాత్మక సిరీస్ ఆరంభం కాబోతోన్న విషయం తెలిసిందే. ఓ టెస్ట్ సహా మొత్తం ఏడు మ్యాచ్‌లల్లో ఈ రెండు జట్లు తలపడనున్నాయి. బర్మింగ్‌హామ్ ఎడ్జ్‌బాస్టన్ స్టేడియం ఈ మ్యాచ్‌కు ఆతిథ్యాన్ని ఇవ్వనుంది. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3:30 గంటలకు మ్యాచ్ మొదలవుతుంది. ఇది రీషెడ్యూల్ మ్యాచ్. ఇదివరకు భారత జట్టు ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లినప్పుడు కరోనా వైరస్ వల్ల వాయిదా పడిన అయిదో టెస్ట్ మ్యాచ్ ఇది.

Story first published: Thursday, June 23, 2022, 17:01 [IST]
Other articles published on Jun 23, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+