Rohit Sharma: ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ ఐపీఎల్ 2025లో అద్బుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఇప్పటివరకు ఆడిన 12 మ్యాచ్‌ల్లో రోహిత్ శర్మ 150 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్‌తో 305 పరుగులు చేశాడు. ఇందులో మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఈ సీజన్‌లో ముంబై తరఫున అత్యధిక పరుగులు చేసిన మూడో ఆటగాడిగా రోహిత్ శర్మ నిలిచాడు. రోహిత్ కంటే ముందు ర్యాన్ రికెల్టన్(361), సూర్యకుమార్ యాదవ్(583) మాత్రమే ఉన్నారు.
రోహిత్ శర్మకు సువర్ణావకాశం
నేడు పంజాబ్ కింగ్స్ జట్టుతో జరగబోయే మ్యాచ్‌లో రోహిత్ శర్మ రెండు భారీ రికార్డులపై కన్నేశాడు. ఆ మ్యాచ్‌లో రోహిత్ శర్మ మరో 67 పరుగులు చేస్తే ఐపీఎల్‌లో 7000 పరుగుల మార్కును చేరుకుంటాడు. రోహిత్ ఆ ఘనతను సాధించిన రెండో బ్యాటర్ అవుతాడు. ఐపీఎల్‌లో విరాట్ కోహ్లీ మాత్రమే ఈ అరుదైన ఘనతను సాధించాడు. విరాట్ కోహ్లీ ఖాతాలో 8552 పరుగులు ఉండగా.. రోహిత్ శర్మ ఖాతాలో 6933 పరుగులు ఉన్నాయి. విరాట్, రోహిత్ తర్వాత క్యాష్ రీచ్ లీగ్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లుగా శిఖర్ ధావన్(6769), డేవిడ్ వార్నర్(6565), సురేష్ రైనా(5528) ఉన్నారు. ఈ చారిత్రాత్మక విజయానికి చేరువలో ఉన్న రోహిత్ శర్మ ఐపీఎల్ 2025 ప్లేఆఫ్ మ్యాచ్‌లలో కూడా ఈ రికార్డును సాధించే అవకాశం ఉంది. ఎందుకంటే ముంబై ఇండియన్స్ ఇప్పటికే ప్లేఆఫ్స్‌లో తన స్థానాన్ని నిర్ధారించుకుంది.

ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లు వీరే..
విరాట్ కోహ్లీ - 8552
రోహిత్ శర్మ - 6933
శిఖర్ ధావన్ - 6769
డేవిడ్ వార్నర్ - 6565
సురేష్ రైనా - 5528
ఎంఎస్ ధోని - 5439
ఇది కాకుండా, రోహిత్ శర్మ ఐపీఎల్‌లో 300 సిక్సర్లు కొట్టిన రెండో ఆటగాడిగా నిలిచేందుకు కేవలం 3 సిక్సర్ల దూరంలో ఉన్నాడు. హిట్‌మ్యాన్ తన ఐపీఎల్ కెరీర్‌లో 297 సిక్సర్లు కొట్టాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సిక్సర్లు కొట్టిన రికార్డు క్రిస్ గేల్ పేరిట ఉంది, అతను 357 సిక్సర్లు కొట్టాడు.
ఐపీఎల్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాటర్లు వీరే..
క్రిస్ గేల్ - 357
రోహిత్ శర్మ - 297
విరాట్ కోహ్లీ - 291
ఎంఎస్ ధోని - 264
ఏబీ డివిలియర్స్ - 251
డేవిడ్ వార్నర్ - 236