Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

రాంచీ టెస్టులో సెంచరీతో అనేక రికార్డులు: సన్నీ తర్వాత రోహిత్ శర్మనే!

Rohit Sharma Equals Sunil Gavaskars Record With 3rd Ton Of Test Series vs South Africa

హైదరాబాద్: రాంచీ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ సెంచరీతో చెలరేగిన సంగతి తెలిసిందే. ఈ సెంచరీతో రోహిత్ శర్మ అనేక రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. 39 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన టీమిండియాను రోహిత్ శర్మ సెంచరీతో ఆదుకున్నాడు.

ఈ సిరీస్‌లో రోహిత్‌కు ఇది మూడో సెంచరీ కావడం విశేషం. మొత్తంగా టెస్టుల్లో రోహిత్ శర్మకు ఇది 6వది కావడం విశేషం. ఈ క్రమంలో టీమిండియా మాజీ క్రికెటర్లు మహేంద్ర సింగ్ ధోని, పటౌడీల సెంచరీల రికార్డుని రోహిత్ శర్మ సమం చేశాడు. ధోని 90 టెస్టుల్లో 6 సెంచరీలు నమోదు చేయగా... రోహిత్ శర్మ తన 30వ టెస్టులోనే 6వ సెంచరీని సాధించాడు.

భారత్‌ తరుఫున అత్యధిక సెంచరీలు

భారత్‌ తరుఫున అత్యధిక సెంచరీలు

ఈ క్రమంలో ఒక సిరీస్‌లో భారత్‌ తరుఫున అత్యధిక సెంచరీలు సాధించిన ఓపెనర్ల జాబితాలో దిగ్గజ ఆటగాడు సునీల్‌ గవాస్కర్‌ తర్వాత ఎక్కువ సెంచరీలు సాధించిన ఆటగాడిగా రోహిత్ శర్మ నిలిచాడు. గవాస్కర్‌ తన కెరీర్‌లో ఒక సిరీస్‌లో మూడు అంతకంటే సెంచరీలను మూడు సందర్భాల్లో సాధించాడు.

1977-78లో ఆస్ట్రేలియాతో

1977-78లో ఆస్ట్రేలియాతో

1977-78లో ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌లో మూడు సెంచరీలు సాధించిన గవాస్కర్‌.. ఆ తర్వాత 1978-79 సీజన్‌లో విండిస్‌తో జరిగిన సిరీస్‌లో నాలుగు సెంచరీలు సాధించాడు. అంతకుముందు 1970-71 సీజన్‌లో కూడా విండిస్‌పై ఒక్క సిరీస్‌లో గవాస్కర్‌ నాలుగు సెంచరీలు సాధించాడు.

మళ్లీ ఇన్నాళ్లకు

మళ్లీ ఇన్నాళ్లకు

ఆ తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు ఒక సిరిస్‌లో టీమిండియా ఓపెనర్ మూడు సెంచరీలు సాధించాడు. ఫలితంగా టీమిండియా మాజీ క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్‌ తర్వాత ఈ ఘనత సాధించిన ఆటగాడిగా రోహిత్ శర్మ అరుదైన ఘనత సాధించాడు. రాంచీ టెస్టులో సెంచరీతో రోహిత్ శర్మ మాజీ క్రికెటర్లు మహేంద్ర సింగ్ ధోని, పటౌడీల సెంచరీల రికార్డుని రోహిత్ శర్మ సమం చేశాడు.

ధోని 90 టెస్టుల్లో 6 సెంచరీలు

ధోని 90 టెస్టుల్లో 6 సెంచరీలు

ధోని 90 టెస్టుల్లో 6 సెంచరీలు నమోదు చేయగా... రోహిత్ శర్మ తన 30వ టెస్టులోనే 6వ సెంచరీని సాధించాడు. అంతేకాదు టెస్టుల్లో 2000 పరుగుల మైలురాయిని కూడా రోహిత్ శర్మ అందుకున్నాడు. అంతేకాదు ఒక టెస్టు సిరీస్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాట్స్‌మన్‌గా రోహిత్‌ శర్మ రికార్డు నెలకొల్పాడు. రాంచీ టెస్టులో రోహిత్ శర్మ తన సెంచరీని సిక్స్‌తోనే సాధించాడు.

132 బంతుల్లో 13 ఫోర్లు, 4 సిక్సుల సాయంతో సెంచరీ

132 బంతుల్లో 13 ఫోర్లు, 4 సిక్సుల సాయంతో సెంచరీ

132 బంతుల్లో 13 ఫోర్లు, 4 సిక్సుల సాయంతో సెంచరీ సాధించాడు. ఈ సిరీస్‌లో 16వ సిక్సర్‌ను రోహిత్‌ ఖాతాలో వేసుకున్నాడు. ఈ క్రమంలోనే విండిస్ ఆటగాడు హెట్‌మెయిర్‌ రికార్డును రోహిత్‌ శర్మ బద్దలు కొట్టాడు. 2018-19 సీజన్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన సిరీస్‌లో హెట్‌మెయిర్‌ 15 సిక్సర్లు బాదాడు. ఇప్పుడు ఆ రికార్డుని రోహిత్ బద్దలు కొట్టాడు.

Story first published: Saturday, October 19, 2019, 15:43 [IST]
Other articles published on Oct 19, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+