అరుదైన ఘనత: టీ20ల్లో అత్యధిక సెంచరీల జాబితాలో రోహిత్ శర్మ


హైదరాబాద్: మూడు టీ20ల సిరిస్‌ను 2-1తేడాతో సొంతం చేసుకుని ఇంగ్లాండ్ పర్యటనను కోహ్లీసేన ఘనంగా ప్రారంభించింది. ఇంగ్లాండ్ పర్యటనలో భాగంగా తొలి టీ20లో గెలిచి, రెండో టీ20లో టీమిండియా ఓడిపోయింది. దీంతో మూడో టీ20 నిర్ణయాత్మకంగా మారింది. దీంతో బ్రిస్టల్ వేదికగా జరిగిన మూడో టీ20లో నెగ్గి సిరిస్‌ను కైవసం చేసుకుంది.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 198 పరుగులు చేసింది. ఒకానొక దశలో ఇంగ్లాండ్ 230 పరుగులు చేసేలా కనిపించింది. అయితే చివర్లో భారత బౌలర్లు అద్భుత ప్రదర్శన చేయడంతో డెత్ ఓవర్లలో ఇంగ్లాండ్ జోరు తగ్గింది. అనంతరం భారీ లక్ష్యంతో బరిలో దిగిన టీమిండియా తొలి ఓవర్ నుంచే దూకుడుగా ఆడింది.

సెంచరీతో చెలరేగిన రోహిత్ శర్మ
ఈ క్రమంలో ధావన్(5) పరుగులకే పెవిలియన్‌కు చేరి నిరాశపరిచినప్పటికీ అనంతరం క్రీజులోకి వచ్చిన కోహ్లీతో కలిసి రోహిత్ శర్మ (56 బంతుల్లో 100 నాటౌట్)గా నిలిచి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఈ సెంచరీతో రోహిత్ శర్మ టీ20ల్లో మరో అరుదైన ఘనతను సాధించాడు. టీ20ల్లో రోహిత్ శర్మకు ఇది మూడో సెంచరీ కావడం విశేషం.

90కిపైగా పరుగులు చేసిన ఆటగాడిగా అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో
దీంతో టీ20ల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో రోహిత్ శర్మ.. న్యూజిలాండ్ ఆటగాడు కొలిన్ మన్రో సరసన చేరాడు. దీంతో పాటు అత్యధికంగా 90కిపైగా పరుగులు చేసిన ఆటగాడిగా రోహిత్ కూడా.. వెస్టిండిస్ క్రికెట్ దిగ్గజం క్రిస్ గేల్ సరసన నిలిచాడు. ఇప్పటికే, వన్డేల్లో రోహిత్ శర్మ మూడు డబుల్ సెంచరీలు చేసిన ఏకైక బ్యాట్స్‌మెన్‌గా కొనసాగుతున్నాడు.

టీ20ల్లో రోహిత్ శర్మ అత్యధిక స్కోరు 118
ఇప్పటివరకు 84 టీ20 మ్యాచ్‌లు ఆడిన రోహిత్.. 77 ఇన్నింగుల్లో 2086 పరుగులు చేశాడు. ఇందులో 3 సెంచరీలు, 15 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. టీ20ల్లో రోహిత్ శర్మ అత్యధిక స్కోరు 118. 2015లో ధర్మశాల వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ తొలి సెంచరీ సాధించాడు.

అత్యధిక టీ20 సిరీస్‌లను గెలిచిన రెండో జట్టుగా భారత్
అనంతరం 2017లో ఇండోర్‌లో శ్రీలంకపై రెండో సెంచరీ సాధించాడు. ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా ఆదివారం బ్రిస్టల్ వేదికగా జరిగిన చివరి టీ20లో మూడో సెంచరీ చేశాడు. మరోవైపు ఇంగ్లాండ్‌పై సిరీస్ విజయం ద్వారా భారత్ అత్యధిక టీ20 సిరీస్‌లను (6) సొంతం చేసుకున్న రెండో జట్టుగా నిలిచింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications