న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఫీల్డింగ్ చేస్తూనే.. స్మిత్‌ని టీజ్ చేసిన రోహిత్! ఇది అందుకు ప్రతీకారమేనా? (వీడియో)!

Rohit Sharma emulating Steve Smith with shadow practise in Brisbane Test
Ind vs Aus 4th Test : Rohit Sharma Emulating Steve Smith With Shadow Practise In Brisbane Test

బ్రిస్బేన్: గబ్బా మైదానంలో టీమిండియాతో జరుగుతున్న నిర్ణయాత్మక చివరి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా నిలకడగా ఆడుతోంది. నాలుగో రోజు టీ విరామానికి ఆసీస్‌ ఏడు వికెట్ల నష్టానికి 243 పరుగులు చేసింది. అయితే నాలుగో రోజు ఆట మొదటి సెషన్‌లో ఓ సరదా సంఘటన చోటు చేసుకుంది. ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్‌మెన్‌ స్టీవ్ ‌స్మిత్‌ని టీమిండియా సీనియర్ ఓపెనర్ రోహిత్ శర్మ సరదాగా టీజ్ చేశాడు. స్మిత్ బ్యాటింగ్ చేస్తుండగా.. ఫీల్డింగ్ చేస్తున్న రోహిత్ క్రీజులోకి వెళ్లి తాను బ్యాటింగ్ చేస్తున్నట్లు పోజిచ్చాడు.

పంత్ గార్డ్ మార్క్‌ని చెరిపేసి స్మిత్

పంత్ గార్డ్ మార్క్‌ని చెరిపేసి స్మిత్

సిడ్నీ వేదికగా ముగిసిన మూడో టెస్టులో స్టీవ్‌ స్మిత్‌ క్రీజులోకి వచ్చి బ్యాటింగ్ చేస్తున్నట్లు పోజిచ్చిన విషయం తెలిసిందే. మూడో టెస్టులో రిషబ్ పంత్‌ బ్యాటింగ్‌ చేసే సమయంలో గార్డ్‌ మార్క్‌లను స్మిత్‌ మార్చేశాడు. డ్రింక్స్ బ్రేక్‌లో పంత్ గార్డ్‌ను కావాల‌ని చెరిపేస్తూ.. స్టంప్స్ కెమెరాకు అడ్డంగా దొరికిపోయాడు. త‌న గార్డ్ చెరిపేయ‌డంతో పంత్ మ‌రోసారి మార్క్ చేసుకోవాల్సి వ‌చ్చింది. స్మిత్ క్రీడాస్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించాడని మాజీ క్రికెటర్లు విమర్శలు గుప్పించచారు పంత్ గార్డ్ మార్క్‌ని చెరిపేయడం ద్వారా అతని బ్యాటింగ్‌ లయని దెబ్బతీసేందుకు స్మిత్ కుట్ర పన్నాడని నెటిజన్లు ఉతికారేశారు.

దోషిగా స్మిత్

స్టీవ్‌ స్మిత్ ఆ వివాదంపై స్పందిస్తూ.. ఫీల్డింగ్ సమయంలో అప్పుడప్పుడు అలా క్రీజులోకి వెళ్లి ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ తమ బౌలర్లని ఎలా ఎదుర్కొంటున్నాడో? స్వయంగా తెలుసుకోవడం తనకి అలవాటు అని వివరణ ఇచ్చుకున్నాడు. టెస్టుల్లో స్మిత్‌ తరచూ క్రీజు వద్దకు వెళ్లి తాను బ్యాటింగ్‌ చేస్తున్నట్లు ఊహించుకుంటాడని, ఈ క్రమంలోనే తనకు అనుకూలంగా గార్డ్‌ మార్క్‌ను మార్చుకుంటాడని ఆస్ట్రేలియా కెప్టెన్ టిమ్‌ పైన్ చెప్పాడు. ఈ ఇద్దరి వివరణపై ఎవరూ పాజిటివ్‌గా రియాక్ట్ అవలేదు. దాంతో స్మిత్ ఓ దోషిగా మిగిలిపోయాడు.

బ్యాటింగ్ చేస్తున్నట్లు పోజు

బ్యాటింగ్ చేస్తున్నట్లు పోజు

స్టీవ్‌ స్మిత్‌ని టీజ్ చేసేందుకు తాజాగా బ్రిస్బేన్ టెస్టులో రోహిత్ శర్మ కూడా అలా క్రీజులోకి వెళ్లి స్టాన్స్ తీసుకుని బ్యాటింగ్ చేస్తున్నట్లు సరదాగా పోజిచ్చాడు. ఓవర్ ముగిసి నేపథ్యంలో పిచ్ మధ్యలో నిల్చొని కామెరూన్ గ్రీన్‌తో స్మిత్ మాట్లాడుతున్నాడు. అదే సమయంలో స్లిప్ నుంచి క్రీజులోకి వచ్చిన రోహిత్.. తాను బ్యాటింగ్ చేస్తున్నట్లు పోజిచ్చాడు. దీంతో స్మిత్ అలా చూస్తూ ఉండిపోయాడు. ఆ తర్వాత తనను టీజ్ చేస్తున్న విషయాన్ని ఆలస్యంగా గ్రహించాడు. ఆపై ఓవర్ మొదలవ్వడంతో స్మిత్ బ్యాటింగ్‌కి వెళ్ళిపోయాడు. దీంతో రోహిత్ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు.

ఇది ప్రతీకారమేనా

ఇది ప్రతీకారమేనా

స్టీవ్ స్మిత్, రోహిత్ శర్మకు సంబందించిన వీడియో నెట్టింట వైరల్ అయింది. నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. 'రోహిత్.. ఇది ప్రతీకారమేనా?' అంటూ కామెంట్ చేస్తున్నారు. నాలుగో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా ఎనిమిదో వికెట్‌ కోల్పోయింది. సిరాజ్ బౌలింగ్‌లో షాట్‌కు యత్నించిన స్టార్క్‌ (1) మిడ్ ‌ఆన్‌లో ఉన్న సైనీ చేతికి చిక్కాడు. ప్రస్తుతం ఆసీస్‌ ఎనిమిది వికెట్ల నష్టానికి 254 పరుగులు చేసింది. ఆసీస్ 287 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. క్రీజులో కమిన్స్‌ (9), లైయన్‌ (4) ఉన్నారు.

‌ఐసీయూలో టీమిండియా మాజీ దిగ్గజ క్రికెటర్‌!!

Story first published: Monday, January 18, 2021, 12:04 [IST]
Other articles published on Jan 18, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X