న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

INDvsBAN: క్యాచ్ వదిలేసి పారిపోయిన రోహిత్.. కెప్టెన్ మైదానం వీడటంపై మండిపడుతున్న ఫ్యాన్స్..!

Rohit Sharma drops catch in INDvsBAN second ODI

బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో వన్డేలో టాస్ ఓడి బౌలింగ్ చేస్తున్న భారత జట్టుకు కెప్టెన్ రోహిత్ శర్మ షాకిచ్చాడు. మహమ్మద్ సిరాజ్ వేసిన రెండో ఓవర్లో రెండు బౌండరీలు బాదిన అనాముల్ హక్.. ఆ తర్వాత రెండు పరుగులు తీశాడు. మరుసటి బంతిని సరిగా అంచనా వేయలేకపోయాడు. సిరాజ్ వేసిన బంతి ఎక్స్‌ట్రా బౌన్స్ అవడంతో బ్యాటును తాకి సెకండ్ స్లిప్స్‌లో ఉన్న రోహిత్ శర్మ వైపు వెళ్లింది. దాన్ని అందుకోవడంలో రోహిత్ విఫలమయ్యాడు.

చేతుల్లోకి వచ్చిన క్యాచ్‌ను జారవిడిచాడు. ఈ క్రమంలో రోహిత్ మణికట్టుకు గాయమైంది. అది నొప్పి పెట్టడంతో అతను మైదానం వీడాడు. రోహిత్ స్థానంలో సబ్‌స్టిట్యూట్‌గా రజత్ పటీదార్ ఫీల్డింగ్‌కు వచ్చాడు. ఇది చూసిన ఫ్యాన్స్ నోరెళ్ల బెట్టారు. గత మ్యాచ్‌లో క్యాచులు వదిలేసిన ఫీల్డర్లను పచ్చిబూతులు తిట్టిన రోహిత్.. తనే ఇలా క్యాచ్ వదిలేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. మరికొందరైతే క్యాచ్ వదిలేసి సిగ్గుతో మైదానం నుంచి పారిపోయాడని కామెంట్లు చేస్తున్నారు.

అయితే ఆ మరుసటి బంతికే అనాముల్ హక్‌ను సిరాజ్ ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేర్చాడు. సిరాజ్ వేసిన బంతి ఇన్ స్వింగ్ అవడంతో అనాముల్ హక్ తడబడ్డాడు. దీంతో అతని బ్యాటును తప్పించుకున్న బంతి ప్యాడ్లను తాకింది. సిరాజ్ సహా టీమిండియా అప్పీల్ చేయగా అంపైర్ అవుటిచ్చాడు. అది హండ్రెడ్ పర్సెంట్ అవుట్ అని తెలుస్తున్నా కూడా అనాముల్ హక్ రివ్యూ కోరాడు.

రీప్లేలో బంతి మిడ్ వికెట్‌ను కూలుస్తుందని తేలింది. దీంతో అతను నిరాశగా మైదానం వీడాడు. అనాముల్ హక్ 9 బంతుల్లో 11 పరుగులు చేశాడు. బంగ్లా జట్టు రెండు ఓవర్లు ముగిసే సమయానికి 11 పరుగులకు ఒక వికెట్ నష్టపోయింది. సిరాజ్ బౌలింగ్ చూసిన వాళ్లంతా అతను కచ్చితంగా వరల్డ్ కప్‌లో ఆడతాడని కొనియాడుతున్నారు.

Story first published: Wednesday, December 7, 2022, 12:03 [IST]
Other articles published on Dec 7, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X