Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఐపీఎల్ అనుకున్నాడా..ఇంటర్నేషనల్ మ్యాచ్ అనుకున్నాడా: రోహిత్ విశ్వరూపం

Rohit Sharma Doesnt Have Any Captaincy Pressure Becomes Player Of The Series vs New Zealand Team

కోల్‌కత: భారత క్రికెట్ జట్టు దుమ్ము లేపింది. న్యూజిలాండ్‌ను చిత్తు చేసింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా సాగిన టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్‌లో ఎదురైన అవమానకర పరాజయాన్ని మరిపించేలా చేసింది. అదే టోర్నమెంట్‌లో రన్నరప్‌గా నిలిచిన న్యూజిలాండ్‌పై తిరుగులేని విజయాన్ని నమోదు చేసింది. కోల్‌కతలోని ప్రతిష్ఠాత్మక ఈడెన్ గార్డెన్స్‌లో ఆదివారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో బ్లాక్ క్యాప్స్‌ను మట్టి కరిపించింది. న్యూజిలాండ్‌ను వైట్‌వాష్ చేసింది. 3-0 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది.

ఊడ్చేసిన జోడీ..

ఊడ్చేసిన జోడీ..

టీమిండియా టీ20 ఫార్మట్ కేప్టెన్‌గా రోహిత్ శర్మ, హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ బాధ్యతలను స్వీకరించిన తరువాత.. ఎదుర్కొన్న తొలి సిరీస్‌ ఇది. దీన్ని ఊడ్చి పడేశారు. మూడు టీ20 మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో ప్రత్యర్థికి ఏ మాత్రం అవకాశం ఇవ్వలేదు. భారీ స్కోర్లు, భారీ తేడాతో విజయాన్ని అందుకుంది రోహిత్ శర్మ-రాహుల్ ద్రావిడ్ జోడీ. ఇదే విజయాలు ఇక మున్ముందు కూడా కొనసాగడం ఖాయంగా కనిపిస్తోంది. దక్షిణాఫ్రికా పర్యటనలోనూ దీన్ని రిపీట్ కాదనడానికి గ్యారంటీ లేదు.

కేప్టెన్‌గా ఒత్తిడి చిత్తు..

కేప్టెన్‌గా ఒత్తిడి చిత్తు..

సాధారణంగా జట్టును నడిపించే బాధ్యతను తీసుకున్న ప్లేయర్.. కొంత ఒత్తిడికి గురి అవుతాడు. అద్భుతంగా బ్యాటింగ్ చేసే ప్లేయర్.. కేప్టెన్‌గా ఛార్జ్ తీసుకున్న తరువాత కొంత నెర్వస్ లోనవుతుంటాడు. దాని ప్రభావం బ్యాటింగ్‌పై పడుతుంటుంది. భారీ స్కోర్లను చేయడంలో తడబాటును ప్రదర్శిస్తుంటారు. ఇలాంటి సందర్భాలు చాలా చూశాం. మహేంద్ర సింగ్ ధోనీ, విరాట్ కోహ్లీ సైతం ఒత్తిళ్లను ఎదుర్కొన్న మ్యాచ్‌లు చాలా ఉన్నాయి.

పూర్తి డిఫరెంట్‌గా రోహిత్..

పూర్తి డిఫరెంట్‌గా రోహిత్..

దీనికి పూర్తి భిన్నంగా కనిపించాడు రోహిత్ శర్మ. అలవోకగా భారీ విజయాలను అందుకోగలిగాడు. తాను వ్యక్తిగతంగా కూడా భారీ స్కోర్లను సాధించాడు. ఈ మూడు మ్యాచ్‌లల్లో రెండు అర్ధసెంచరీలు చేశాడంటే.. అతని దూకుడు ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. మరో మ్యాచ్‌లో హాఫ్ సెంచరీకి చేరువగా వెళ్లాడే గానీ దాన్ని అందుకోలేకపోయాడు. కేప్టెన్‌గా తీసుకున్న అదనపు బాధ్యతలకు సంబంధించిన ఒత్తిడి తన బ్యాటింగ్‌పై ఏ మాత్రం పడకుండా జాగ్రత్త పడగలిగాడు హిట్ మ్యాన్. సరికొత్త సంప్రదాయానికి తెర తీసినట్టనిపించింది.

మూడు మ్యాచ్‌లల్లో టాప్ స్కోరర్‌గా..

మూడు మ్యాచ్‌లల్లో టాప్ స్కోరర్‌గా..

న్యూజిలాండ్‌పై జరిగిన ఈ మూడు టీ20 మ్యాచ్‌లల్లో రోహిత్ శర్మ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. 159 పరుగులు చేశాడు. హయ్యెస్ట్ స్కోర్ అతనిదే. జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో జరిగిన తొలి మ్యాచ్‌లో 48 పరుగులు చేశాడు. తృటిలో హాఫ్ సెంచరీని మిస్ చేసుకున్నాడు. రాంచీలో జరిగిన మ్యాచ్‌లో ఆ కొరతను పూర్తి చేసుకున్నాడు. 36 బంతుల్లో 55 పరుగులు చేశాడు. ఇందులో అయిదు భారీ సిక్సర్లు ఉన్నాయి. ఫోర్ ఒకటే. ఈడెన్ గార్డెన్స్ మ్యాచ్‌లోనూ చెలరేగిపోయాడు. 31 బంతుల్లో 56 పరుగులు పిండుకున్నాడు.

కేప్టెన్సీ కొత్తేమీ కాదు గానీ..

కేప్టెన్సీ కొత్తేమీ కాదు గానీ..

రోహిత్ శర్మకు ఓ జట్టును నడిపించడం కొత్తేమీ కాదు. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌కు అతనే కేప్టెన్. తన ఫ్రాంఛైజీని అత్యుత్తమంగా తీర్చిదిద్దాడు. అయిదు సార్లు ఛాంపియన్‌గా నిలబెట్టాడు. మరే జట్టు కూడా అన్నేసి సార్లు ఐపీఎల్ టైటిల్‌ను అందుకోలేదు. అదే అనుభవం అతనికి టీ20 ఇంటర్నేషనల్స్‌లో అక్కరకు వచ్చింది. జట్టులో యువరక్తాన్ని ప్రోత్సహించాడు. వారిని ముందు ఉండి నడిపించాడు. తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకున్నాడు.

విక్టరీ కేప్టెన్..

విక్టరీ కేప్టెన్..

టీ20 ఫార్మట్‌లో కేప్టెన్‌గా రోహిత్ శర్మ అందుకున్న విజయాల పర్సంటేజ్ చాలా ఎక్కువ. రికార్డు స్థాయిలో ఆ రేషియోను నమోదు చేసుకున్నాడు హిట్ మ్యాన్. అతని కేప్టెన్సీలో టీమిండియా ఇప్పటిదాకా 22 టీ20 మ్యాచ్‌లను ఆడింది. అందులో 18 మ్యాచ్‌లను గెలిచిందంటే అతని శక్తి సామర్థ్యాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. నాలుగు మ్యాచ్‌లల్లో మాత్రమే ఓడింది రోహిత్ సారథ్యంలోని భారత జట్టు.

Story first published: Monday, November 22, 2021, 10:47 [IST]
Other articles published on Nov 22, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+