Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Rohit Sharma: ఒక్క మ్యాచ్ ఓడితే రోహిత్ చెత్త కెప్టెన్ అవుతాడా?.. మండిపడ్డ మాజీ లెజెండ్!

డబ్ల్యూటీసీ ఫైనల్‌లో భారత జట్టు ఘోరంగా ఓడింది. ఆసీస్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో ఏకంగా 209 పరుగుల తేడాతో చిత్తయింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ వ్యూహాలు, కెప్టెన్సీపై ఫ్యాన్స్, నిపుణులు మండిపడ్డారు. కనీసం పట్టుదల చూపించలేదని తిట్టిపోశారు. ఈ క్రమంలోనే వెస్టిండీస్ పర్యటన నుంచి టీమిండియాకు టెస్టుల్లో కొత్త కెప్టెన్‌ను నియమించాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు.

దీనిపై ఆసీస్ మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్ స్పందించాడు. కేవలం ఒక్క మ్యాచ్ ఓడిపోగానే రోహిత్‌ను చెత్త కెప్టెన్ అనడం కరెక్ట్ కాదని క్లార్క్ అభిప్రాయపడ్డాడు. 'నేనైతే రోహిత్‌పైనే నమ్మకం ఉంచుతా. అతను మంచి కెప్టెన్. తన ఎగ్రెసివ్ విధానం నాకు బాగా ఇష్టం. ఎంత పాజిటివ్‌గా ఉండగలడో అంత పాజిటివ్‌గా ఉంటాడతను. ఐపీఎల్‌లో కెప్టెన్‌గా అతని సక్సెస్ చూడండి' అని క్లార్క్ అన్నాడు.

Rohit Sharma was ordinary at WTC Final

'డబ్ల్యూటీసీ ఫైనల్‌లో టీమిండియా గెలవలేదనే కారణంతో.. జట్టుకు కెప్టెన్‌గా రోహిత్ పనికిరాడని అనడం సమంజసం కాదు. వరుసగా రెండో సారి భారత జట్టు ఫైనల్ చేరిందనే విషయం మర్చిపోకండి. అది కూడు టెస్టుల్లో ఈ ఫీట్ సాధించడం అంత ఈజీ కాదు. గత నాలుగేళ్లలో ఈ టీం ఆడిన టెస్టులు చూస్తేనే వాళ్లు ఎంత గొప్పగా ఆడుతున్నారో అర్థం అవుతుంది. వన్డే వరల్డ్ కప్ కూడా ఉన్న నేపథ్యంలో జట్టులో నిలకడ ముఖ్యం' అని క్లార్క్ చెప్పాడు.

'కెప్టెన్ అయిన తర్వాత రోహిత్ అద్భుతంగా ఆడాడు. ఆస్ట్రేలియాపై సిరీస్ గెలిపించాడు. లాస్ట్ సిరీస్‌లో అతని సెంచరీని అప్పుడే మర్చిపోతే ఎలా? ఒక్క ఫైనల్ మ్యాచ్ ఓడిపోగానే అతను చెత్త కెప్టెన్ అవ్వడు. అలాగే భారత్ కూడా బ్యాడ్ టీం అవదు. వరుసగా ఫైనల్ చేరడం అంటే అంత ఈజీ కాదు. ఈ నాలుగేళ్లలో భారత్ మాత్రమే రెండు సార్లు ఫైనల్ చేరిందని మర్చిపోకండి. కాబట్టి ఇలాంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఈ విషయాలన్నీ గుర్తుచేసుకోవాలి' అని పేర్కొన్నాడు.

Story first published: Monday, June 19, 2023, 19:34 [IST]
Other articles published on Jun 19, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+