Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

INDvsAUS : మొదటి బంతికే అవుటైనా.. బతికిపోయిన రోహిత్.. ఆ తర్వాత కాసేపటికే!

Rohit Sharma dismissed after a shaky start in third INDvsAUS test

ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్టు సిరీసులో అద్భుతమైన ఫామ్‌లో ఉన్న టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ.. ఇండోర్ టెస్టులో ఫెయిలయ్యాడు. ఈ మ్యాచ్ తొలి బంతికే రోహిత్ అవుటయ్యాడు. కానీ అంపైర్ తప్పిదంతో బతికిపోయాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌కు ఈ మ్యాచ్‌లో అంత గొప్ప ఆరంభం దక్కలేదు. పిచ్ నుంచి బౌలర్లకు మంచి సహకారం లభిస్తుండటంతో రోహిత్ తడబడ్డాడు.

తొలి బంతికే..

తొలి బంతికే..

మిచెల్ స్టార్క్ వేసిన మొదటి ఓవర్ తొలి బంతిని అంచనా వేయడంలోనే రోహిత్ ఫెయిలయ్యాడు. దీంతో లైట్‌గా ఎడ్జ్ తీసుకున్న బంతి కీపర్ క్యారీ చేతుల్లో పడింది. అయితే అంపైర్ అవుటివ్వలేదు. ఈ బంతికి స్టార్క్ గట్టిగా అప్పీల్ చేశాడు కానీ.. క్యారీ అంత నమ్మకంగా కనిపించలేదు.

దీంతో స్టీవెన్ స్మిత్ కూడా రివ్యూ కోరలేదు. అయితే ఆ తర్వాత చూస్తే స్నికోలో రోహిత్ బ్యాటును బంతి తాకినట్లు స్పష్టంగా కనిపించింది. అది చూసిన ఆస్ట్రేలియా ఫీల్డర్లు చాలా డిసప్పాయింట్ అయినట్లు కనిపించారు.

నాలుగో బంతికి కూడా..

నాలుగో బంతికి కూడా..

అదే ఓవర్లో మరోసారి బంతి తనకు దూరంగా వెళ్తుందని రోహిత్ అనుకున్నాడు. కానీ అది లోపలకు వచ్చింది. దీంతో ఎల్బీడబ్ల్యూకు స్టార్క్ అప్పీల్ చేశాడు. ఈసారి కూడా అంపైర్ అవుటివ్వలేదు. అప్పుడు కూడా పక్కన ఉన్న ఫీల్డర్లను, కీపర్ క్యారీని స్టీవెన్ స్మిత్ సంప్రదించాడు.

వాళ్లు కూడా కొంత అనుమానం వ్యక్తం చేయడంతో మళ్లీ రివ్యూ కోరలేదు. కాసేపటి తర్వాత రిప్లే వేసి చూడగా.. అది కూడా అవుట్ అని తేలింది. బంతి పిచ్, ఇంపాక్ట్ కరెక్ట్‌గానే ఉన్నాయి. అలాగే అది వికెట్లను పడగొడుతున్నట్లు కనిపించింది. అప్పుడు కూడా ఆసీస్ కెప్టెన్ చాలా చిరాకు పడ్డాడు.

కునేమన్ ముంచాడు..

కునేమన్ ముంచాడు..

ఆ తర్వాత కొంచెం క్రీజులో కుదురుకున్నట్లు కనిపించిన రోహిత్.. కునేమన్ వేసిన ఆరో ఓవర్లో ముందుకొచ్చి భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించి స్టంపౌట్ అయ్యాడు. అతను ఈ మ్యాచ్‌లో కేవలం 12 పరుగులే చేశాడు. ఈ సిరీసులో రోహిత్‌కు ఇదే అత్యల్ప స్కోరు కావడం గమనార్హం.

రోహిత్ అవుటైన కాసేపటికే మరోసారి బంతి అందుకున్న కునేమన్.. శుభ్‌మన్ గిల్ (21)ని కూడా అవుట్ చేశాడు. కునేమన్ వేసిన బంతిని డిఫెండ్ చేసుకోవడానికి గిల్ ప్రయత్నించాడు. కానీ ఎడ్జ్ తీసుకున్న బంతిని స్లిప్స్‌లో ఉన్న స్మిత్‌ చక్కగా అందుకోవడంతో గిల్ పెవిలియన్ చేరాడు.

Story first published: Wednesday, March 1, 2023, 10:18 [IST]
Other articles published on Mar 1, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+