Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఏబీ డెవిలియర్స్ రికార్డు బద్దలు కొట్టిన రోహిత్ శర్మ

Rohit Sharma Demolishes This AB de Villiers Record Set In 2015

ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియంలో శ్రీలంకతో జరిగిన రెండో టీ20 టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసింది. టీమిండియా నిర్ణీత ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 260 పరుగులు చేసింది. బౌలింగ్, ఫీల్డింగ్‌తో శ్రీలంక జట్టును కట్టుదిట్టం చేసి 172 పరుగుల తేడాతో గెలుపొందింది.

ఈ మ్యాచ్‌లో చెలరేగి ఆడిన రోహిత్ శర్మ శ్రీలంక బౌలర్లకు చుక్కుల చూపించాడు.
23 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించిన అతడు ఆ తర్వాత 11 బంతుల్లోనే మిగతా 50 పరుగులు పూర్తి చేసిన సెంచరీ చేశాడు. టీ20ల్లో రోహిత్ శర్మకు ఇది రెండో సెంచరీ. 35 బంతుల్లో 11 ఫోర్లు, 8 సిక్సుల సాయంతో 101 పరుగులను రోహిత్ శర్మ సాధించాడు. టీ20 చరిత్రలో వేగవంతమైన సెంచరీని నమోదు చేశాడు.

ఏబీ డెవిల్లియర్స్‌ను దాటేశాడు:
టీ 20 చరిత్రలో 43 బంతులకు 118 స్కోరు చేసిన రోహిత్ శర్మ 12 ఫోర్లు, పది సిక్సర్లు తీశాడు. దీంతో అతను ఈ 2017 క్యాలెండర్ ఇయర్ 64 సిక్సులు చేసిన ఘనత నమోదైంది. ఇప్పటి వరకు 2015 సంవత్సరానికి గాను ఏడీ డెవిల్లియర్స్ చేసిన 63 సిక్సర్ల రికార్డును దాటేశాడు. 2012 సంవత్సరంలో క్రిస్ గేల్స్ 59 సిక్సర్ల రికార్డును డెవిలియర్స్ బ్రేక్ చేశాడు.

డేవిడ్ మిల్లర్ రికార్డు సమం:
ఈ క్రమంలో దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మన్ డేవిడ్ మిల్లర్ రికార్డును రోహిత్ శర్మ సమం చేశాడు. మొత్తం 12 ఫోర్లు, 10 సిక్సులు బాదిన రోహిత్ శర్మ.. 43 బంతులకు 118 పరుగులు చేసి ఔటయ్యాడు. చమీరా వేసిన 13వ ఓవర్‌లో తొలి మూడు బంతులను సిక్స్, ఫోర్, సిక్స్ బాదిన రోహిత్ ఆ తర్వాతి బంతిని కూడా బౌండరికి తరలించే ప్రయత్నంలో ధనంజయకి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Saturday, December 23, 2017, 11:57 [IST]
Other articles published on Dec 23, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+