న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అందుకే సమయం తీసుకున్నా: రోహిత్ శర్మ

Rohit Sharma defends Mohammed Siraj after win against Bangladesh

హైదరాబాద్: ముక్కోణపు టీ 20సిరీస్‌లో భాగంగా భారత జట్టు బంగ్లాదేశ్‌పై విజయం సాధించింది. బుధవారం కొలంబో వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో బంగ్లా జట్టును భారత జట్టు 17పరుగుల తేడాతో ఓడించింది. జట్టు రాణించడంపై భారత కెప్టెన్‌ రోహిత్‌ శర్మ సంతృప్తి వ్యక్తం చేశాడు. ఈ సిరీస్‌లో వరుసగా విఫలమవుతూ వస్తున్న తనకు బంగ్లాపై సాధించిన హాఫ్‌ సెంచరీ ఎంతో విలువైనదిగా, చాలా ముఖ్యమైనదిగా పేర్కొన్నాడు.

ఇక బౌలింగ్‌ విషయానికొస్తే వాషింగ్టన్‌ సుందర్‌ ఆకట్టుకున్నాడు. మ్యాజికల్‌ స్పెల్‌తో మ్యాచ్‌ను మా వైపుకు తిప్పాడు. మొత్తం బౌలింగ్‌ యూనిట్‌ చాలా నిలకడగా బౌలింగ్‌ చేసింది. ఈ స్లో వికెట్‌పై బ్యాటింగ్‌ చేయడం కష్టంగా మారింది. దాంతోనే కుదురుకోవడానికి నేను ఎక్కువ సమయం తీసుకోవాల్సి వచ్చింది.

బంగ్లాదేశ్‌ మ్యాచ్‌లో 89 పరుగులు సాధించిన రోహిత్‌ శర్మ విజయంలో ముఖ్యపాత్ర పోషించాడు. మ్యాచ్‌ తర్వాత రోహిత్‌ మాట్లాడుతూ..' నేను ముందుకు వెళ్లడానికి ఈ ఇన్నింగ్స్‌ చాలా ముఖ్యమైనది. ఆదిలో కుదురుకోవడానికి సమయం తీసుకున్నా. దాంతో నా సహజ సిద్ధమైన షాట్లను ఆడా. మేము ఇంకా 10 -15 పరుగులు తక్కువ చేశామనే అనుకుంటున్నా. చివరి ఓవర్లలో బంగ్లాదేశ్‌ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్‌ చేసి మమ్మల్ని మరిన్ని పరుగులు చేయకుండా అడ్డుకున్నారు.

క్రీజ్‌లో నిలదొక్కుకున్న బ్యాట్స్‌మన్‌ మాత్రమే ఇక్కడ వికెట్‌పై హిట్‌ చేసే అవకాశం ఉంది. క్రీజ్‌లోకి అప్పుడే వచ్చిన బ్యాట్స్‌మన్‌ రాణించడం మాత్రం కచ్చితంగా కష్టమే' అని రోహిత్‌ విశ్లేషించాడు.

Story first published: Thursday, March 15, 2018, 14:09 [IST]
Other articles published on Mar 15, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X