For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

రోహిత్ శర్మ డ్యాన్స్: పెళ్లి జంటకు మరపురాని క్షణం! (వీడియో)

Rohit Sharma: టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ తన ఆటతోనే కాకుండా తన చేష్టలతో కూడా అభిమానుల హృదయాలను ఆకట్టుకుంటాడు. ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయిన ఓ వీడియోలో రోహిత్ శర్మ ఒక కొత్తగా ఎంగేజ్‌మెంట్ చేసుకున్న జంటకు మరపురాని రోజును అందించాడు. ఈ హృదయాన్ని ఆకట్టుకునే చర్యకు ఫ్యాన్స్ ఆయనపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

పెళ్లి ఫొటో‌షూట్‌కు హిట్ మ్యాన్ సర్‌ప్రైజ్
హిట్ మ్యాన్ రోహిత్ శర్మ తన వర్కౌట్ సెషన్‌లో ఉన్నప్పుడు బయట ప్రాంగణంలో ఓ జంట తమ వివాహ ఫోటో షూట్ చేసుకోవడం గమనించాడు. ఆ సందర్భం రోహిత్ శర్మలో ఉన్న ఉల్లాసభరితమైన కోణాన్ని బయటకు తెచ్చింది. టనే రోహిత్ శర్మ ఒక స్పీకర్‌లో ప్రముఖ హిందీ పాట 'ఆజ్ మేరే యార్ కీ షాదీ హై' ను పెట్టారు. పాటకు రోహిత్ ఉత్సాహంగా డ్యాన్స్ చేయడం ప్రారంభించారు. ఊహించని సర్ప్రైజ్‌ చూసి ఆ జంట ఎంతో సంతోషించింది. "ఇదొక మరపురాని క్షణం అయ్యింది" అంటూ జీవితంలో ఒక్కసారి మాత్రమే లభించే అద్భుతమైన జ్ఞాపకంగా అభివర్ణించారు. హిత్ శర్మ చేసిన ఈ చిన్నపాటి సరదా చర్య ఆ జంట రోజును నిజంగా చిరస్మరణీయం చేసింది.

Rohit Sharma Dance Surprise A Wedding Couples Unforgettable Moment Video Goes Viral

ప్రపంచ కప్ అనుమానాలకు రోహిత్ బ్రేక్
రోహిత్ శర్మ ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన మూడు వన్డేల సిరీస్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లోకి తిరిగి వచ్చారు. ఈ ఏడాది ప్రారంభంలో ఇంగ్లాండ్ పర్యటనకు ముందు టెస్టుల నుంచి రిటైర్ అయిన నేపథ్యంలో వన్డే కెరీర్ దృష్ట్యా రోహిత్, విరాట్ కోహ్లీలకు ఈ సిరీస్ చాలా కీలకం. ముఖ్యంగా ప్రపంచ కప్‌లో చోటు దక్కించుకోవాలంటే, జట్టు కోసం మ్యాచ్‌లు గెలవగల సామర్థ్యం తమకు ఉందని నిరూపించుకోవాల్సిన అవసరం ఈ దిగ్గజ ఆటగాళ్లకు ఉంది. ఈ సిరీస్‌లో రోహిత్ శర్మ ఒక సెంచరీ, ఒక అర్ధ సెంచరీతో అద్భుత ప్రదర్శన చేసి తన ఫామ్, ఫిట్‌నెస్ గురించి ఉన్న సందేహాలకు ముగింపు పలికారు. మరోవైపు విరాట్ కోహ్లీ మొదటి రెండు మ్యాచ్‌లలో డకౌట్‌ అయినప్పటికీ, చివరి వన్డేలో మ్యాచ్-విన్నింగ్ అర్ధ సెంచరీతో పుంజుకున్నారు.

రోహిత్, కోహ్లీ త్వరలో దక్షిణాఫ్రికాతో స్వదేశంలో జరిగే సిరీస్‌లో ఆడనున్నారు. ఈ సిరీస్‌లో కూడా అదే ఫామ్ కొనసాగించగలిగితే, ప్రపంచ కప్‌ జట్టులో వారికి చోటు దక్కించుకోవడం చాలా సులభం అవుతుంది.

Story first published: Tuesday, November 11, 2025, 11:02 [IST]
Other articles published on Nov 11, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+