For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆమ్లా, సచిన్ రికార్డు బద్దలు: ఓపెనర్‌గా రోహిత్ శర్మ సరికొత్త రికార్డు

IND VS AUS 2020,2nd ODI : Rohit Sharma Became The Fastest Batsman To Score 7000 ODI Runs !
Rohit Sharma Creates History After Completing 7,000 Runs As ODI Opener

హైదరాబాద్: రాజ్‌కోట్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ అరుదైన రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు. వన్డేల్లో అత్యంత వేగంగా 7000 పరుగుల మైలురాయిని అందుకున్న ఓపెనర్‌గా రోహిత్ శర్మ రికార్డు సాధించాడు.

1
46131

ఈ మ్యాచ్‌కి ముందు రోహిత్ శర్మ ఓపెనర్‌గా 6,987 వన్డే పరుగులు చేశాడు. అయితే, ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ 13 పరుగులు చేయడంతో ఈ అరుదైన ఘనత సాధించాడు. రోహిత్ శర్మ తన 137వ ఇన్నింగ్స్‌లో ఈ మైలురాయిని అందుకున్నాడు.

ఓపెనర్‌గా రోహిత్ శర్మ రికార్డు

ఓపెనర్‌గా రోహిత్ శర్మ రికార్డు

ఈ జాబితాలో దక్షిణాఫ్రికా మాజీ బ్యాట్స్‌మెన్ హషీం ఆమ్లా(147 ఇన్నింగ్స్‌లు), సచిన్ టెండూల్కర్(160), తిలకరత్నే దిల్షాన్(165), సౌరవ్ గంగూలీ(168) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. వన్డేల్లో 7000 పరుగులు సాధించిన 11వ ఓపెనర్‌గా రోహిత్ శర్మ గుర్తింపు పొందాడు.

నాలుగో ఓపెనర్‌గా రోహిత్ శర్మ

ఇక, భారత్ తరుపున వన్డేల్లో 7000 పరుగుల మైలురాయిని అందుకున్న నాలుగో ఓపెనర్‌గా నిలిచాడు. అంతకముందు సచిన్ టెండూల్కర్(15,310), సౌరవ్ గంగూలీ(9,146), వీరేంద్ర సెహ్వాగ్(7,518)లు ఈ ఘనత సాధించారు. రెండో వన్డేలో జట్టు స్కోరు 81 పరుగుల దగ్గర రోహిత్ శర్మ(42) ఔటయ్యాడు.

ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగిన రోహిత్ శర్మ

ఆడమ్‌ జంపా వేసిన ఇన్నింగ్స్‌ 14వ ఓవర్‌ మూడో బంతికి రోహిత్‌ ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. జంపా వేసిన బంతిని రివర్స్‌ స్వీప్‌ ఆడటానికి యత్నించగా అది రోహిత్‌ ప్యాడ్లకు తాకింది. ఆసీస్ ఫీల్డర్లు అప్పీలు చేయగా ఫీల్డ్‌ అంపైర్ ఔటిచ్చాడు. దీనిపై రివ్వూకు వెళ్లిన రోహిత్‌కు అక్కడ కూడా నిరాశే ఎదురైంది.

మరో 4 పరుగులు చేసి ఉంటే

మరో 4 పరుగులు చేసి ఉంటే

జంపా బౌలింగ్‌లో వన్డేలు, టీ20ల్లో కలుపుకుని రోహిత్‌ శర్మ ఔట్‌ కావడంతో ఇది నాలుగోసారి. ఫలితంగా విరాట్‌ కోహ్లీ తర్వాత స్థానంలో రోహిత్‌ శర్మ నిలిచాడు. జంపా బౌలింగ్‌లో కోహ్లి (వన్డేలు, టీ20లు) ఆరు సందర్భాల్లో పెవిలియన్‌ చేరాడు. కాగా, ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ మరో 4 పరుగులు చేసి ఉంటే 9000 పరుగుల క్లబ్‌లో చేరేవాడు.

Story first published: Friday, January 17, 2020, 16:22 [IST]
Other articles published on Jan 17, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+