ఈడెన్‌లో అరుదైన ఘనత: టీ20ల్లో రోహిత్ శర్మ కెప్టెన్సీ రికార్డు

హైదరాబాద్: వెస్టిండిస్‌తో ప్రస్తుతం జరుగుతున్న మూడు టీ20ల కోసం రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లీకి విశ్రాంతినిచ్చిన సెలక్టర్లు అతడి స్థానంలో రోహిత్ శర్మను ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. తనకు అందివచ్చిన కెప్టెన్సీ అవకాశాన్ని రోహిత్ శర్మ చక్కగా ఒడిసిపట్టుకోవడంతో పాటు తనకు తిరుగులేదని నిరూపించుకుంటున్నాడు.

తొలి టీ20లో భారత్ ఐదు వికెట్ల తేడాతో విజయం
ఇటీవల దుబాయి వేదికగా ముగిసిన ఆసియాకప్‌లో సైతం టీమిండియా ఛాంపియన్‌గా నిలబెట్టిన రోహిత్ శర్మ ప్రస్తుతం విండిస్‌తో జరుగుతున్న ఈ సిరిస్‌లో టీమిండియాను విజయపథంలో నడిపిస్తున్నాడు. ఆదివారం ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన తొలి టీ20లో వెస్టిండిస్ జట్టుపై టీమిండియా ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.

అరుదైన ఘనత సాధించిన రోహిత్ శర్మ
ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ అరుదైన ఘనతను సాధించాడు. టీ20ల్లో అత్యధిక విజయాల ఘనతను అందుకున్నాడు. కెప్టెన్‌గా తొలి పది టీ20 మ్యాచ్‌లకు సారథ్యం వహించిన జాబితాలో రోహిత్ శర్మ అగ్రస్థానంలో నిలిచాడు. ఇప్పటి వరకు రోహిత్ శర్మ పది అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించగా అందులో తొమ్మిది విజయాలు సాధించాడు.

తొలి పది టీ20 మ్యాచ్‌లకు కెప్టెన్‌గా
దీంతో తొలి పది టీ20 మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించిన జాబితాలో రోహిత్ శర్మ అగ్రస్థానంలో నిలిచాడు. ఈ క్రమంలో షోయబ్ మాలిక్, మైకేల్ క్లార్క్, అస్కార్ అప్ఘాన్, సర్పరాజ్ అహ్మద్‌ల రికార్డును రోహిత్ శర్మ బద్దలు కొట్టాడు. ఈ నలుగురు తొలి పది టీ20ల్లో ఎనిమిది విజయాలను నమోదు చేసిన కెప్టెన్లుగా ఉన్నారు.

లక్నో వేదికగా రెండో టీ20
తాజాగా రోహిత్ శర్మ వారిని అధిగమించాడు. దీంతో పాటు తొమ్మిది వన్డేలకు కెప్టెన్‌గా చేసిన రోహిత్ శర్మ ఏడు విజయాలను నమోదు చేశాడు. కాగా, మూడు టీ20ల సిరిస్‌లో భాగంగా ఈడెన్ వేదికగా జరిగిన తొలి టీ20లో భారత్ విజయం సాధించడంతో ఈ సిరిస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఇరు జట్ల మధ్య రెండో టీ20 మంగళవారం లక్నో వేదికగా జరగనుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications