Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2022: ముంబై ఇండియ‌న్స్‌లోకి చాహ‌ల్.. క‌న్‌ఫ‌మ్‌ చేసిన కెప్టెన్‌ రోహిత్ శ‌ర్మ‌!

Rohit Sharma Confirms Yuzvendra Chahal To Play For Mumbai Indians In IPL 2022
IPL 2022 Mega Auction : Team India Star Spinner Yuzvendra Chahal In Mumbai Indians | Oneindia Telugu

ఐపీఎల్ మెగా వేలానికి స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డ‌డంతో ఏ ఆట‌గాడిని ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయ‌నుంద‌నే ఆస‌క్తి పెరుగుతోంది. జ‌ట్ల కెప్టెన్ల స‌ల‌హాల‌తో కూడా ప్రాంచేజీలు వేలంలో ఆట‌గాళ్ల‌ను కొనుగోలు చేస్తుంటాయి. ఈ నేప‌థ్యంలో మెగా వేలంలో ముంబై ఇండియ‌న్స్ క‌చ్చితంగా కొనుగోలు చేయ‌బోయే ఓ ఆట‌గాడి గురించి వార్త ఒక‌టి బ‌య‌టికి వ‌చ్చింది. ఈ విషయాన్ని స్వ‌యంగా ఆ జ‌ట్టు కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌నే క‌న్‌ఫ‌మ్ చేసిన‌ట్లు చెబుతున్నారు.

ధృవీక‌రించిన రోహిత్‌

ధృవీక‌రించిన రోహిత్‌

ఐపీఎల్ 2022లో టీమిండియా స్టార్ స్పిన్న‌ర్ య‌జుర్వేంద్ర చాహ‌ల్ ఈ సారి ముంబై ఇండియ‌న్స్ త‌ర‌ఫున బ‌రిలోకి దిగే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్నాయి. ఈ దిశ‌గా ఆ జ‌ట్టు కెప్టెన్ రోహిత్ శ‌ర్మ ధృవీక‌రించాడ‌ని ప‌లువురు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఆదివారం వెస్టిండీస్‌తో మ్యాచ్ ముగిసిన అనంత‌రం 100 వికెట్ల మైలురాయిని చేరుకున్న‌ చాహ‌ల్‌ను రోహిత్ ఇంట‌ర్వ్యూ చేశాడు. 100 వికెట్లు తీసిన చాహ‌ల్‌ను అభినందించాడు. అలాగే 100 వికెట్లు తీయ‌డం ప‌ట్ల ఎలా అనిపిస్తుంద‌ని చాహ‌ల్‌ను ప్ర‌శ్నించాడు. దానికి చాహ‌ల్ చాలా గ‌ర్వంగా ఉంద‌ని, ఇంత వేగంగా ఈ ఘ‌న‌త సాధిస్తాన‌ని ఎప్పుడూ అనుకోలేద‌ని చెప్పుకొచ్చాడు. అలాగే నీవు అదృష్ట‌వంతుడివ‌ని, త్వ‌ర‌లోనే ఐపీఎల్ మెగా వేలం వ‌స్తుంద‌ని తొలి వ‌న్డేలో చాహ‌ల్ ప్ర‌ద‌ర్శ‌న‌ను ఉద్దేశించి రోహిత్ అన్నాడు. దీనికి ధ‌న్య‌వాదాలు రోహిత్ భ‌య్యా అని చాహ‌ల్ అన్నాడు.

ముంబై ఇండియ‌న్స్‌లోకి చాహ‌ల్‌

ముంబై ఇండియ‌న్స్‌లోకి చాహ‌ల్‌

అయితే ఈ సంభాణ‌ను నెటిజన్లు వైర‌ల్ చేస్తున్నారు. ఈ సారి చాహ‌ల్ ముంబై ఇండియ‌న్స్ త‌ర‌ఫున ఆడ‌నున్నాడ‌ని, అందుకే రోహిత్ ప‌రోక్షంగా హింట్ ఇచ్చాడ‌ని వారు చెబుతున్నారు. వేలంలో ఎంత ధ‌రైనా స‌రే వెచ్చించి చాహ‌ల్‌ను కొనుగోలు చేయాల‌ని ముంబై ఇండియ‌న్స్ మెనేజ్‌మెంట్‌కు రోహిత్ చెప్పాడ‌ట‌. దీనికి ముంబై మెనేజ్‌మెంట్ కూడా అంగీక‌రించిన‌ట్లు స‌మాచారం. చాహ‌ల్ రాక‌తో త‌మ స్పిన్ విభాగం బ‌ల‌ప‌డుతుంద‌ని ముంబై ఇండియ‌న్స్ భావిస్తోంద‌ట‌.

ధ‌ర ఎంతంటే

ధ‌ర ఎంతంటే

ఈ సారి మెగా వేలంలో చాహ‌ల్ 2 కోట్ల రూపాయ‌ల బేస్ ప్రైజ్‌తో ఉన్నాడు. అయితే చాహ‌ల్ ప్ర‌స్తుతం మంచి ఫామ్‌లో ఉండ‌డంతో అత‌డి కోసం వేలంలో పోటీ ఖాయంగా కనిపిస్తోంది. పోటీ ఎంత ఉన్నా స‌రే రోహిత్ ఆదేశించ‌డంతో ముంబై ఇండియ‌న్స్ చాహ‌ల్‌ను కొనుగోలు చేయాల‌ని ప‌ట్టుద‌ల‌గా ఉంది. దీంతో చాహ‌ల్ కోసం 8 కోట్ల రూపాయ‌ల నుంచి 12 కోట్ల రూపాయ‌లు వెచ్చించ‌డానికి ముంబై ఇండియ‌న్స్ యాజ‌మాన్యం సిద్ధంగా ఉంద‌ని స‌మాచారం. కాగా గ‌తేడాది రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరుకు ప్రాతినిధ్యం వ‌హించిన‌ చాహ‌ల్‌కు ఈ సారి ఆ జ‌ట్టు రిటెన్ష‌న్ జాబితాలో చోటు ద‌క్కేలేదు.

100 వికెట్ల మైలురాయిని చేరుకున్న చాహ‌ల్‌

100 వికెట్ల మైలురాయిని చేరుకున్న చాహ‌ల్‌

ఆదివారం వెస్టిండీస్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో టీమిండియా ఘ‌న‌విజ‌యం సాధించింది. ఈ మ్యాచ్‌లో స్పిన్న‌ర్ చాహ‌ల్ అద‌ర‌గొట్టాడు. 4 వికెట్ల‌తో చెల‌రేగాడు. అంతేకాకుండా వ‌న్డేల్లో 100 వికెట్ల మైలురాయిని కూడా చేరుకున్నాడు. 60 మ్యాచ్‌ల్లోనే ఈ ఘ‌న‌త సాధించాడు. త‌ద్వారా వన్డేల్లో వేగంగా 100 వికెట్లు తీసిన రెండో భార‌త స్పిన్ బౌల‌ర్‌గా నిలిచాడు. మొత్తం ఐదో భార‌త్ బౌల‌ర్‌గా నిలిచాడు. చాహ‌ల్ అద్భుత ప్ర‌ద‌ర్శ‌న‌తో వెస్టిండీస్‌ను టీమిండియా 176 ప‌రుగుల‌కే క‌ట్ట‌డి చేసింది. అనంత‌రం ల‌క్ష్యాన్ని 4 వికెట్లు కోల్పోయి ఘ‌న‌విజ‌యం సాధించింది. ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా చాహ‌ల్‌నే వ‌రించింది.

Story first published: Monday, February 7, 2022, 18:28 [IST]
Other articles published on Feb 7, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+