Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సరిగ్గా ఇదే రోజు టీమిండియాలో అడుగుపెట్టిన హిట్ మ్యాన్, 15ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఓ స్పెషల్ లెటర్

Rohit sharma Completed 15Years of Cricket Career on this Day, He Shares A special letter on Twitter

సరిగ్గా 15ఏళ్ల క్రితం ఇదే రోజున భారత కెప్టెన్ రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు. 2007 జూన్ 23న బెల్‌ఫాస్ట్‌లో ఐర్లాండ్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లో టీమిండియా తరపున రోహిత్ తన మొట్టమొదటి మ్యాచ్ ఆడాడు. ఇక ఈ 15ఏళ్లలో రోహిత్ సాధించిన మైలురాళ్లు, అందుకున్న రికార్డులు, అందించిన క్రికెట్ వినోదం అంతా ఇంతాకాదు.

ఇక అంతర్జాతీయ క్రికెట్‌లో 15ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా తన సోషల్ మీడియా ద్వారా ఓ ప్రత్యే హృదయపూర్వక సందేశాన్ని అభిమానులతో పంచుకున్నాడు. ఈ సందర్భంగా తన ఈ 15ఏళ్ల క్రికెట్ జర్నీలో భాగమైన ప్రతి ఒక్కరికీ రోహిత్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపాడు. తన జీవితాంతం క్రికెట్‌ను ఆదరిస్తానని పేర్కొన్నాడు.

నేను ఇంటర్నేషన్ ప్లేయర్ అయ్యానంటే..

నేను ఇంటర్నేషన్ ప్లేయర్ అయ్యానంటే..

రోహిత్ తాను రాసిన లేఖలో.. 'నాకు ఇష్టమైన జెర్సీ(టీమిండియా జెర్సీ)లో 15 సంవత్సరాలు పూర్తిచేసుకున్నాను. అందరికీ నమస్కారం. నేను భారత్ తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసి నేటితో 15ఏళ్లు పూర్తయ్యాయి. ఇది ఎంతో గొప్ప ప్రయాణం. తప్పకుండా నా జీవితాంతం దీన్నో స్పెషల్‌గా భావిస్తాను. ఈ ప్రయాణంలో భాగమైన ప్రతి ఒక్కరికీ నేను కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నాను. ఈ రోజు నేనో అంతర్జాతీయ ప్లేయర్‌గా మారానంటే కొందరు వ్యక్తులు నాకందించిన హితోధిక సాయం. వాళ్లందరికీ ప్రత్యేక ధన్యవాదాలు' అని రోహిత్ ప్రస్తావించాడు.

అభిమానుల మద్దతు వల్లే..

క్రికెట్ ప్రేమికులు, అభిమానులు, విమర్శకులందరికీ ధన్యవాదాలు. జట్టు పట్ల మీకున్న ప్రేమ, మీ మద్దతు వల్లనే మనమందరం అనివార్యంగా ఎదురయ్యే ఎన్నో అడ్డంకులను అధిగమించాం. ప్రస్తుతం భారత క్రికెటర్ల పట్ల మీరు చూపుతున్న ప్రేమాభినాలు మన జట్టును ఈ స్థాయిలో ఉంచాయి. మీ అందరికీ ధన్యవాదాలు అని రోహిత్ తన లేఖను ముగించాడు. రోహిత్ 20ఏళ్ల వయసులో జట్టులో అరంగేట్రం చేసి ప్రస్తుతం 35వ వడిలోకి చేరుకున్నాడు.

అన్ని ఫార్మాట్ల కెప్టెన్‌గా

అన్ని ఫార్మాట్ల కెప్టెన్‌గా

మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో జన్మించిన రోహిత్ శర్మ ఇప్పటివరకు తన అంతర్జాతీయ కెరీర్లో మొత్తం 230 వన్డేలు, 125 టీ20లు, 45టెస్టులు ఆడాడు. భారతదేశం తరపున అన్ని ఫార్మాట్‌లలో కలిపి 15,733పరుగులు చేశాడు. ఇక విరాట్ కోహ్లీ టీ20 కెప్టెన్‌గా వైదొలిగిన తర్వాత, అలాగే గత సంవత్సరం వన్డే కెప్టెన్‌గా తొలగిన తర్వాత రోహిత్‌ పూర్తిస్థాయిలో భారత పరిమిత ఓవర్ల ఫార్మాట్లకు కెప్టెన్‌గా నియమితుడయ్యాడు. ఇక దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్ట్ సిరీస్లో భారత్ ఓటమి తర్వాత కోహ్లీ కెప్టెన్సీ నుంచి వైదొలగడంతో బీసీసీఐ రోహిత్‌ను టెస్ట్ కెప్టెన్‌గాను నియమించింది. దీంతో అన్ని ఫార్మాట్ల కెప్టెన్‌గా ప్రస్తుతం రోహిత్ కొనసాగుతున్నాడు.

ఇంగ్లాండ్ పర్యటనలో రోహిత్

ఇంగ్లాండ్ పర్యటనలో రోహిత్

ఇకపోతే ప్రస్తుతం భారత్-ఇంగ్లాండ్ మధ్య రీషెడ్యూల్ చేసిన 5వ టెస్ట్ కోసం రోహిత్ ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్నాడు. జులై 1వ తేదీన తొలి టెస్ట్ మ్యాచ్ ఆరంభమౌతుంది. దీనికంటే ముందు భారత జట్టు నేటి నుంచి వార్మప్ టెస్ట్ మ్యాచ్ ఆడనుంది. నాలుగు రోజుల ఈ వార్మప్ మ్యాచ్‌లో భారత జట్టు లీసెస్టర్‌షైర్‌ కౌంటీ క్లబ్‌తో తలపడనుంది.

మధ్యాహ్నం 3:30గంటలకు మ్యాచ్ మొదలవుతుంది. లీసెస్టర్‌షైర్ కౌంటీ క్రికెట్ క్లబ్ అధికారిక యూట్యూబ్ ఛానల్ ఫాక్సెస్ దీన్ని ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. లీసెస్టర్‌షైర్ కౌంటీ క్లబ్ జట్టులో చేతేశ్వర్ పుజారా, రిషభ్ పంత్, జస్‌ప్రీత్ బుమ్రా, ప్రసిద్ధ్ కృష్ణ టీమిండియా ప్లేయర్లు ఆడబోతుండగా.. రోహిత్ శర్మ సారధ్యంలో ఇండియా జట్టు ఆడనుంది.

Story first published: Thursday, June 23, 2022, 14:22 [IST]
Other articles published on Jun 23, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+