హైదరాబాద్: భారత జట్టు రెగ్యులర్ బౌలర్లు వికెట్లు తీయలేని సమయంలో పార్ట్ టైమ్ బౌలర్ కేదార్ జాదవ్‌ని కోహ్లీ అప్పుడప్పుడు ప్రయోగిస్తున్న సందర్భాన్ని మనం చూశాం. అలాంటి కేదార్ జాదవ్‌ని శ్రీలంక ఫాస్ట్ బౌలర్ లసిత్ మలింగతో పోల్చాడు.
లసిత్ మలింగ్ ప్రపంచ క్రికెట్‌లో పరిచయం అక్కర్లేని పేరు. అద్భుతమైన యార్కర్లతో ప్రత్యర్థి బ్యాట్స్ మన్లను బెంబెలెత్తిస్తుంటాడు. అయితే మలింగ యాక్షన్‌ను పోలిన క్రికెటర్ టీమిండియాలో స్పిన్నర్ రూపంలో ఉన్నాడని రోహిత్ శర్మ పేర్కొన్నాడు.
ఇంతకీ ఆ స్ఫిన్నర్ ఎవరిని అనుకుంటున్నారా? అతనే కేదార్ జాదవ్. ఈ మేరకు తన ఇనిస్టాగ్రామ్ ఖాతాలో పోస్టు చేశాడు. 'ఆందోళన వద్దు.. మనకు ఒక మలింగా ఉన్నాడు' అని ఫోటో కింద క్యాప్షన్‌ను పెట్టాడు.