Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఐసీసీ ర్యాంకులు: ఐదు సెంచరీలతో కోహ్లీకి మరింత చేరువగా రోహిత్ శర్మ

Rohit Sharma closes in on Virat Kohli in ICC ODI rankings after 5th hundred in World Cup 2019

హైదరాబాద్: ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్‌లో టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఇప్పటికే ఈ ప్రపంచకప్‌లో ఐదు సెంచరీలు సాధించి అనేక రికార్డులను తన ఖాతాలో వేసుకున్న రోహిత్ శర్మ తాజాగా ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌‌లోనూ దూసుకొస్తున్నాడు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

ప్రపంచకప్ లీగ్‌ స్టేజీ ముగిసే సరికి రోహిత్‌ శర్మ ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో రెండో స్థానంలో నిలిచాడు. అదే సమయంలో పాయింట్ల పరంగా టాప్‌ ప్లేస్‌లో ఉన్న టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లికి రోహిత్‌ మరింత చేరవయ్యాడు. విరాట్ కోహ్లీ 891 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా, రోహిత్‌ 885 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచాడు.

442 పరుగులు చేసిన కోహ్లీ

442 పరుగులు చేసిన కోహ్లీ

ఈ ప్రపంచకప్‌లో విరాట్ కోహ్లీ 63.14 యావరేజితో 442 పరుగులు నమోదు చేశాడు. ఇందులో ఐదు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. దీంతో కోహ్లీ ఖాతాలో కేవలం ఒక పాయింట్‌ మాత్రమే నమోదైంది. ఈ ప్రపంచకప్‌కు ముందు రోహిత్‌ శర్మకు కోహ్లీకి 51 పాయింట్ల వ్యత్యాసం ఉన్న సంగతి తెలిసిందే.

లీగ్‌ దశ ముగిసే సరికి

లీగ్‌ దశ ముగిసే సరికి

అయితే, లీగ్‌ దశ ముగిసే సరికి వీరిద్దరి మధ్య ఆరు పాయింట్ల తేడా ఉండటం ఇక్కడ విశేషం. ఈ క్రమంలో రోహిత్ శర్మ తన వన్డే కెరీర్‌లో అత్యుత్తమ రేటింగ్‌ పాయిట్లను సాధించాడు. శనివారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో సెంచరీ సాధించడంతో రోహిత్ శర్మ అనేక రికార్డులను బద్దలు కొట్టిన సంగతి తెలిసిందే.

ప్రపంచకప్‌లో అత్యధిక సెంచరీలు

ప్రపంచకప్‌లో అత్యధిక సెంచరీలు

ముఖ్యంగా ఒక ప్రపంచకప్‌లో అత్యధిక సెంచరీలు సాధించిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఈ క్రమంలో నాలుగు సెంచరీలతో ఈ జాబితాలో ఉన్న శ్రీలంక మాజీ క్రికెట్ దిగ్గజం కుమార సంగక్కర రికార్డును రోహిత్ శర్మ బద్దలుగొట్టాడు. దీంతో తన రేటింగ్‌ పాయింట్లను కూడా రోహిత్ శర్మ గణనీయంగా పెంచుకున్నాడు.

బౌలర్లలో బుమ్రాదే అగ్రస్థానం

బౌలర్లలో బుమ్రాదే అగ్రస్థానం

ఇక, బౌలింగ్‌ విభాగంలో భారత పేసర్‌ జస్ప్రీత్‌ బుమ్రా తొలి స్థానాన్ని మరింత పదిలం చేసుకున్నాడు. ఈ ప్రపంచకప్‌లో ఇప్పటికే 17 వికెట్లు సాధించిన బుమ్రా తన పాయింట్ల ఆధిక్యాన్ని 21 నుంచి 56కు పెంచుకున్నాడు. బుమ్రా 814 పాయింట్లతో తొలి స్థానంలో కొనసాగుతుండగా, ట్రెంట్‌ బౌల్ట్‌(న్యూజిలాండ్‌) 758 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు.

Story first published: Monday, July 8, 2019, 18:53 [IST]
Other articles published on Jul 8, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+