ఓపెనర్‌గా టెస్టుల్లో రోహిత్ సక్సెస్ అవుతాడు: సన్నీ

హైదరాబాద్: తన వన్డే కెరీర్‌లో తొలి ఆరేళ్లు రోహిత్ శర్మ పెద్దగా రాణించలేదనే చెప్పాలి. 2013లో ధోని నాయకత్వంలో రోహిత్ శర్మ ఓపెనర్‌గా ప్రమోట్ కాకముందు వరకు 81 వన్డేలాడాడు. యావరేజి 30గా ఉంది. అయితే, ఓపెనర్‌గా బరిలోకి దిగడం ఆరంభించిన తర్వాత భారత క్రికెట్ అభిమానులు రోహిత్ శర్మలోని 'హిట్ మ్యాన్'ను చూశారు.
పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో భారత జట్టుకు ఓ పవర్ హౌస్ మాదిరి తయారయ్యాడు. ఇప్పటివరకు టీమిండియా తరుపున 218 వన్డేలాడి 48.5 యావరేజిని కలిగి ఉన్నాడు. వన్డేల్లో రోహిత్ శర్మ మొత్తం 25 సెంచరీలు చేయగా... ఓపెనర్‌గా 23 సెంచరీలు చేయడం విశేషం. అయితే, టెస్టుల్లో మాత్రం రోహత్ శర్మ ఆ స్థాయి ప్రదర్శన చేయలేకపోయాడు.

విశాఖపట్నం వేదికగా తొలి టెస్టు
అక్టోబర్ 2 నుంచి విశాఖపట్నం వేదికగా భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య తొలి టెస్టు మ్యాచ్ జరగనుంది. ఈ టెస్టు సిరిస్‌లో పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో వైస్ కెప్టెన్‌గా వ్వవహారిస్తోన్న రోహిత్ శర్మ... మయాంక్ అగర్వాల్‌తో కలిసి ఓపెనర్‌గా బరిలోకి దిగనున్నాడు. ఈ నేపథ్యంలో టెస్టు ఓపెనర్‌గా కూడా రోహిత్ సక్సెస్ కాగలడని మాజీ క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ ధీమా వ్యక్తం చేశాడు.

డిఫెన్స్‌ను మరింత కఠినతరం చేసుకోవాలి
అయితే తన డిఫెన్స్‌ను మరింత కఠినతరం చేసుకోవాలని గవాస్కర్ సూచించడం విశేషం. ఈ సందర్భంగా గవాస్కర్ మాట్లాడుతూ "టెస్టు క్రికెట్‌కు పరిమిత ఓవర్ల క్రికెట్‌కు ఉన్న తేడా ఏమిటో మనకు తెలుసు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో బంతి స్వింగ్ కావడం తక్కువగా ఉంటుంది. కొన్ని ఓవర్లు మాత్రమే స్వింగ్ రాబట్టే అవకాశం ఉంటుంది" అని అన్నాడు.

ఎర్ర బంతి చాలా ఎక్కువగా స్వింగ్
"అయితే టెస్టుల్లో ఉపయోగించే ఎర్ర బంతి చాలా ఎక్కువగా స్వింగ్ అవుతుంది. 35-40 ఓవర్ల తర్వాత కూడా బంతి నుంచి స్వింగ్ రాబట్టొచ్చు. కాబట్టి ఆ స్వింగ్‌ను ఎదుర్కొవాలంటే రోహిత్ శర్మ తన బ్యాటింగ్ శైలిని మార్చుకోవాలి. ఎక్కువ స్వింగ్‌కు ఇబ్బంది పడే రోహిత్ శర్మ టెక్నిక్‌లో ఎటువంటి లోపం లేదు" అని గవాస్కర్ తెలిపాడు.

శరీరంపైకి వచ్చే బంతుల్ని సెహ్వాగ్ వదిలేస్తాడు
"రోహిత్ షాట్ సెలక్షన్ కచ్చితంగా ఉంటే పరుగులు రాబాట్టొచ్చు. గతంలో సెహ్వాగ్ ఎలా తన డిఫెన్స్‌ను టెస్టుల్లో ఉపయోగించాడో అదే తరహాలో రోహిత్ శర్మ కూడా ఆడాలి. ఆన్ సైడ్‌లో శరీరంపైకి వచ్చే బంతుల్ని సెహ్వాగ్ వదిలేసే వాడు. అదే ఫార్ములాను టెస్టుల్లో రోహిత్ ఫాలో కావాలి. అదే రోహీత్ ఆన్ సైడ్ బంతుల్ని హుక్ షాట్లగా కొడతాడు. ఇదే ప్రమాదకరం. టెస్టుల్లో తన షాట్ సెలక్షన్‌ను రోహిత్ మార్చుకుంటే సక్సెస్ అవుతాడు" అని సన్నీ తెలిపాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications