Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

రోహిత్ శర్మ కొత్త కారు.. వామ్మో అన్ని కోట్లా?

Rohit Sharma: భారత స్టార క్రికెటర్ రోహిత్ శర్మ మరోసారి తన లగ్జరీ కార్ల ప్రేమను చాటుకున్నారు. ఇప్పటికే ఒక లాంబోర్ఘిని ఉరస్ కారు ఉన్న రోహిత్.. ఇప్పుడు దాని అప్‌గ్రేడ్ మోడల్ అయిన "లాంబోర్ఘిని ఉరస్ ఎస్ఈ" కారును కొనుగోలు చేశారు. ఈ కొత్త కారు ధర ఎక్స్-షోరూంలోదాదాపు రూ.4.57 కోట్లుగా ఉంది. ఈ కొత్త మోడల్‌లో హైబ్రిడ్ పవర్‌ట్రైయిన్, మరింత మెరుగైన పనితీరు, అనేక డిజైన్ అప్‌డేట్లు ఉన్నాయి.

రోహిత్ శర్మ కొత్త కారు వివరాలు ఇలా..
రోహిత్ శర్మ కొత్త కారు డెలివరీకి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గతంలో రోహిత్ శర్మ దగ్గర ఉన్న నీలి రంగు లాంబోర్ఘిని ఉరస్ కారుకు భిన్నంగా, ఈ సారి ఆయన ఆరెంజ్ కలర్ కారును ఎంచుకున్నారు.

Rohit Sharma Buys New Lamborghini Urus SE Worth 4 57 Crore Full Specs Inside

లాంబోర్ఘిని ఉరస్ ఎస్ఈ ప్రత్యేకతలు
శక్తివంతమైన ఇంజన్: ఈ కారులో 4.0-లీటర్ ట్విన్-టర్బోఛార్జ్‌డ్ V8 ఇంజన్ ఉంది. ఇది కేవలం ఒక్క ఇంజన్‌తో 620 హెచ్‌పీ శక్తిని,800 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి 25.9 kWh లిథియం-అయాన్ బ్యాటరీ, ఎలక్ట్రిక్ మోటార్‌ను జత చేశారు. దీనితో కారు మొత్తం శక్తి దీనితో కారు మొత్తం శక్తి 800 హెచ్‌పీ, టార్క్ 950 ఎన్ఎమ్‌కు పెరుగుతుంది. ఎలక్ట్రిక్ మోటార్ 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో కలిసి పనిచేస్తుంది, ఇది కారును మరింత వేగవంతంగా, సున్నితంగా నడిపిస్తుంది.

ఎలక్ట్రిక్ మోడ్‌లో ప్రయాణం: ఈ లగ్జరీ ఎస్‌యూవీ కేవలం ఎలక్ట్రిక్ మోడ్‌లో గంటకు 130 కిలోమీటర్ల వేగంతో 60 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు.

వేగం: ఈ కారు కేవలం 3.4 సెకన్లలో 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. దీని గరిష్ట వేగం గంటకు 312 కిలోమీటర్లు.

డిజైన్, ఫీచర్లు: ఉరస్ ఎస్ఈ కారులో కొత్త ఎల్ఈడీ మ్యాట్రిక్స్ హెడ్‌లైట్స్, కొత్త బంపర్, పెద్ద గ్రిల్, 23-అంగుళాల అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. ఇవి కారుకు మరింత ఆకర్షణీయమైన రూపాన్ని ఇస్తాయి.

Story first published: Saturday, August 9, 2025, 17:08 [IST]
Other articles published on Aug 9, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+